నా కథ-12 ( గురుకుల పాఠశాల)— డా.బోంద్యాలు బానోత్(భరత్)

ఎట్టకేలకు రవీందర్ హాల్ టికెట్ నెంబర్ పైన వేరే అబ్బాయి జాయినవుతుంటే దొరిక బట్టీ, రవీందర్ పేరు మీద కాల్ లేటర్ ఇష్యూ చేయించి, ఆ లేటర్ పట్టుకోని ఇంటికి పోయి, రవీందర్ ని తీసుకొని వచ్చి, ఏటూరు నాగారం గురుకుల పాఠశాలలో చేర్పించాను.
అది గురుకుల పాఠశాల. అంటే చదువుతో పాటు భోజన వసతి వుంటుంది. జయినైన రోజే సాయంకాలం 5గం. అందరూ గ్రౌండ్లో గుమ్మిగూడిండ్లు. టీచర్స్ క్వార్టర్స్ లో నుండి పీఈటీ సర్ బయల్దేరంగా చూసి, విద్యర్థులందరు, తమ తమ తరగతి ప్రకారం, క్రమంగా కూర్చో వడం మొదలు పెట్టారు. పీఈటీ సర్ వచ్చి, ఒక గంటసేపు వ్యాయామం చేయించాడు. చివరిగా అతిముఖ్యమైన సమయపాలన గురించీ మాట్లాడుతూ, విద్యార్థి జీవితంలో అతి ముఖ్యమైన విషయం ‘టయింటే బుల్ ‘ అని చెవుతూ టాయింటేబుల్ రాపించాడూ.
మార్నింగ్ మార్నింగ్ 5. గం. లేసి, 30 నిమిషాల్లో కాల్లు కృత్యాలు తీర్చుకొని, 5:30 నుండి 6:30 మార్నింగ్ పీఈటీ, 6:30 నుండి మార్నింగ్ 7 గంటల వరకు తయ్యారై, కచ్చితంగా 7 గంటలకు మార్నింగ్ అసెంబ్లీకీ అడేండ్ కావాలి. 7 నుండి 7:45 అసెంబ్లీ జరుగుతుంది.7:45 నుండీ 8:30 వరకు ఫస్ట్ పీరియడ్ అవుతుంది. 8:30 నుండి 9:00 వరకు బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. 9:00 నుండి 1:00 వరకు క్లాస్ లు నడుస్తాయి. 1:00 – 2:00 వరకు మద్యాన భోజనం ఉంటుంది. తర్వాత 2:00 నుండి 4:30 వరకు స్టడీ అవర్ ఉంటుంది. 4:30 నుండి 5:00 వరకు రెస్టు. 5:00 నుండి 6:00 వరకు ఈవినింగ్ పీఈటీ ఉంటుంది. సాయంత్రం 6:00 నుండి 7:30 వరకు సాయంత్రం భోజనం ఉంటుంది. సాయంత్రం 7:30 నుండి రాత్రి 9:30 వరకు సూపర్ వైజింగ్ స్టడీ ఉంటుంది.రాత్రి 9:30 నుండి మార్నింగ్ 5:00 వరకు నిద్రపోవాలి. ఐతే, ఆదివారం మరియు సెలవు రోజుల్లో మాత్రం ఈ పాయింటేబుల్ ల్లో కొద్దగ మార్పు ఉంటుంది. మిగతా సమయాల్లో ఆజీటీజ్ గానే ఉంటుంది. అర్థమయిందనుకుంటా.
సో, ఇప్పుడు సాయంకాల భోజన సమయం అయింది. అందరూ లైయీన్గా వెళ్ళి, లయీన్గా నిలబడీ, అన్నం పట్టుకొని, భోజనం చేసి, వెంటనే సూపర్వైంజింగ్ స్టాడీకీ వెళ్ళాలి.” అని చేప్పాడు మా పీఈటీ సర్.
మార్నింగ్ అల్పహారం ఉండేది. వారంలో, ఒక రోజు చెపాతి, ఒక రోజు పూరి, మిగితా రోజుల్లో కిచిడీ పెట్టేవాళ్ళు. ఆదివారం రోజున వాటిల్లోనే ఏదోకటి స్పేషల్ చేసేవాళ్ళు. మార్నింగ్ అల్పహారం తోపాటూగా ఒక గ్లాస్ పాలు ఇచ్చేవాళ్ళు. ఆహారం విషయంలో నైనా, చదువు విషయంలో నైనా, మామూలు ఎస్టీ హాస్టల్ తో పోల్చనప్పుడు, ఈ గురుకుల పాఠశాల చాలా మంచిగనిపించింది. మాద్యాహ్నం భోజనంలో , అన్నంతో పాటూ పప్పు, సాంబర్, ఒక కరీ కూడా వుండేది. రెండు పూటలు పెరుగు(పలచటిదీ) ఇచ్చేవాళ్ళు. డిన్నర్లో కూడా, మాద్యాహ్న భోజనం లాగానే ఇచ్చేవాళ్ళు. వారానికీ ఒకటీ లేదా రెండు రోజుల బాయిల్డేగ్ ఇచ్చేవాళ్ళు . సిక్కైన వాళ్ళకూ సపరేటుగా, బ్రెడ్డూ, పాలు.. ఇచ్చేవాళ్ళు. సాయంత్రం 4:00 లకు స్నాక్స్ ఇచ్చేవాళ్ళు. మొత్తం మీద ఆహారం, చుదువు బాగానే ఉండేది.
ఐతే, ఈ టయింటేబుల్ తోపాటూగా, టీచర్లూ కూడా మాతోనే ఉండే వారు. టీచర్లు కూడా అక్కడే భోజనం చేసే వాళ్ళు. రాత్రి భోజనం చేసిన తర్వాత తమ తమ క్లాస్ రూం లోనే, సుపర్వైజింగ్ స్టడీ నడిసేది. కొన్ని రోజులు బటర్ ఫ్లై బిల్డింగ్ (డార్మేటరి) లో సూపర్వైజింగ్ స్టడీ జరిగింది. కాని తర్వాత మళ్లీ క్లాస్ రూంలోనే జరిగింది.
నేను 8వ తరగతి చదువుతున్నాను. మా క్లాస్ మేట్స్ కొంతమంది ‘9:30 స్పాట్ ‘ అనే పదాన్ని తరుచూగ వాడే వాళ్ళు. అదేదో సినిమాలో డైలాగ్ అనుకున్నాను. కాని, తర్వాత తర్వాత అర్థమయింది ఏమిటంటే! ‘విద్యార్థుల మధ్య గొడవలైతే, వాటిని వాళ్ళే సరిదిద్దుకోవడం, ఒకరు ఇంకొకరికి వార్నింగ్ ఇవ్వడం, అవసరమైతే కొట్టుకోవడం… చేసే వాళ్ళు’ ఈ రకమైన చెర్యలు రాత్రి 9:30 తర్వాత, టీచర్లు ఇంటికి వేళ్ళాక చేసేవాళ్ళు. దాని పేరే ‘9:30 స్పాట్ ‘ అని అనే వాళ్ళు. ఇందులో కామన్ గొడవలు ఉండేవి, అదేవిధంగా లాంబాడీ విద్యార్థులకు మరియు కోయ విద్యార్థులకు మద్య చిన్న చిన్న విభేదాలు తలెత్తి, గొడవలు చేసే వాళ్ళు, మళ్ళీ కలిసి మెలిసి ఉండేవాళ్ళు.
ఇక పుస్తకాలు, కాపీల విషయానికొస్తే, పాఠ్యపుస్తకాలు ఫ్రీగానే ఇచ్చే వాళ్ళు. నోట్ బుక్స్ అవసరమైనన్ని ఇచ్చేవాళ్ళు. ప్రతి సబ్జెక్టుకీ నోట్స్ రొసేవాళ్ళం. అప్పుడు రేనాల్డ్స్ పెన్నులు వాడకంలో ఉండేవి. కేవలం రీఫీల్స్ మాత్రమే కొనుక్కునే వాళ్ళం.
నేను 8వ తరగతిలో జాయిన్ అయ్యాను. మొట్ట మొదటి క్లాస్ తెలుగు సార్ తిసుకున్నాడు. ఆయన అసలు పేరు గుర్తుకులేదు కాని మేము పెట్టిన పేరు ‘కూక్డో'(కోడి పుంజు)గుర్తుంది.
ఆయన క్లాస్ రూం లోకి ప్రవేశిస్తుంటే, క్లాసంతా కాముగున్నది. ఒకచేత పుస్తకం, మరోచేత చాక్ పీస్ పట్టుకొని, నల్లబల్లపై తెల్లని అక్షరాలతో ‘బిడాలము’ అని రాసి.. మౌనంగానే ఉన్నట్టుండి, ఒకేసారి గర్జించే స్వరంతో ‘ఎవ్వరక్కడా?’ అంటే, మేమంతా ఒకే సారి వెనుకకు చూసాము. అప్పుడు ఆయన ‘అక్కడ కాదు ఇక్కడా ‘ అని, పాఠం మొదలు పెట్టాడు. చాలా చక్కగా వివరించారు.
హిందీ చెప్పడానికి ,ముస్లిం సార్ ఉండేవాడు. నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పేవాడు. కాని అప్పుడే ట్రాన్స్ ఫర్ అయ్యి వెళ్ళి పోయాడు. సంవత్సరం తర్వాత 9వ తరగతి చివరి అంకంలో, హిందీ కీ ‘సుదర్శన్’ సారొచ్చాడు. పదవ తరగతి, మా బ్యాచ్ వరకూ, ఆయానే హిందీ చెప్పేవాడు.
సార్లందరు సబ్జెక్టులవారిగా తమ తమ సబ్జెక్టులలో నిస్నాతులు. అందరు బాగానే చెప్పేవారు. కాని ఓంభ్రహ్మం సారు విద్యార్థులలో సామాజిక చైతన్యం కలిగించేవాడు. పిల్లలతో కలిసి ఉండేవాడు. పిల్లలతో కలిసి ఆటలాడేవాడు.
నేను 8వ తరగతి నుండి స్కౌట్ లో ఉండేవాడిని . నేను స్కౌట్ లో ఒక ట్రూప్ కి లీడర్ గా ఉండేవాడిని. ప్రతి సంవత్సరం ఒకటీ లేదా రెండు సార్లు స్కౌట్ క్యాంప్ నిర్వహించేవారు. క్యాంప్ టెంట్లు వేసేవాళ్ళము. టెంట్లు వేయడంలో ట్రూపుల మధ్య పోటీ ఉండేది. ఆ టెంట్లు వేసే పోటిల్లో ప్రతిసారి నాకే ప్రథమ స్థానం వచ్చేది.
ప్రతి సంవత్సరం స్కూల్ ‘డే’ నిర్వహించేవారు. స్కూల్ ‘డే’ సంధర్బంగా రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహించే వారు. అందులో ఒక ప్రోగ్రామ్ మూడనమ్మకాలు, మంత్ర-తంత్రాలకు వ్యతిరేకంగా, ప్రదర్శీంచారు. అందులో నేను ‘మాంత్రికుడిగా’ నటించాను. ఇంకో ప్రోగ్రామ్ జానపదం మాద్యమంగా, ప్రజలు తాగుడుకి బానిసై, బాగా తాగొచ్చీ, ఇంట్లో తమ తమ భార్యలను కొట్టీ, తన్నీ, వాళ్ళ మెడలో పుస్తెలమ్ముకునే వాళ్ళు. ఈ సమస్య మీద ప్రదర్శీంచిన, ప్రదర్శనలో తాగుబోతు మొగుడిగా, నేను నటించాను. నాకు తోడుగా మహిళా పాత్రలో, నా స్నేహితుడు వీరస్వామి నటించాడు. నా స్కూల్ జీవితంలో, ఈ రెండు ఘటనలు, నాకు విశేషంగా గుర్తుండి పోయాయి.
ఐతే, మా గురుకుల పాఠశాలలో, విద్యార్థుల బట్టలుతకటంకోరకు ‘ధోబీ’ ఉండేవాడు. వారానికొకసారి విద్యార్థుల బట్టలను సేకరించి, ఉతికి, ఇస్తిరిచేసి తెచ్చిచ్చేవారు. కాని 3 నుండి 4 వందల మంది విద్యార్థుల బట్టలు వుండటం వలనా, బట్టలు తారుమారైయ్యేటివి, తోందరగా చినిగేటివి. అందువలన, వర్షాకాలం తప్పా , మిగతా కాలంలో , అదివారం మరియు సెలవుల్లో , రెండు కిలోమీటర్ దూరంలోని జంప్పన్నా వాగులోకి పోయి, బట్టలు పిండుకోని, ఆ మెత్తటి ఇసుకలో కాసేపు ఆడుకోని, స్నానాలు చేసుకోని, ఆ మడికట్లలోపడి, తిరిగి ‘గురుకుల’ కు వచ్చీ, మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళం.
మా గురుకుల స్కూల్ (గిరిజన)లో 3-4 వందల మంది విద్యార్థులు చదువుకొనే వారు. మా స్కూల్ లో, వారానికోసారి టీవీ వేసేవాళ్ళు. అందులో దూరదర్శన్ లో సినిమాలు చూపించేవాళ్ళు. కొన్నాళ్ళకు ఆ టీవీ రిపేరుకీ రావడంతో, తర్వాత పిల్లలు ముఖ్యంగా 8,9,10 వ తరగతి వారు, 5-10 మంది, గుంపులుగా, చలికాలం, ఎండాకాలంలో, స్కూల్ నుండీ షార్ట్ కట్ లో, రాత్రి పూట, మడికట్లల్లోపడి, వెన్నల వెలుగులో, రెండు కీలోమీటర్ దూరం, ఏటూరు నాగారం, వెళ్ళీ, సినిమా చూసి, వచ్చేవాళ్ళం. ఎప్పుడైన ఒక్కసారి, సెలవు రోజున, పగలు పూట, సినిమాకో లేదా సరదాగా బయటకో, వెళితే, పీఈటీ సార్ భయముడేది.
చలికాలంలో 9వ,10వ తరగతి వాళ్ళు, మార్నింగ్ 5:30 గం: లేసి, మా గురుకుల స్కూల్ నుండీ తుపాకుల గూడెం బ్రిర్డిజీ వరకు రన్నింగ్ చేసేవాళ్ళం. ఆ బ్రిర్డిజీ వరకు పోయి, వెనకకు తిరిగి వచ్చేటప్పుడు, ఆ కంకర రోడ్డు, అడవిని ఆనుకొని వుండుటవలన, వందలాదిగా , గుంపులుగా, జింకలు, జింక పిల్లలు చెంగు చెంగుమని ఎగురుకుంటూ, ఆ రోడ్డు దాటుతూ కనిపిచేవి. ఆవిధంగా వాటిని చూస్తూంటే, ఎనలేని ఆనందం కలిగేది.
మా స్కూల్ ను ఆనుకొనే అడవి ఉండేది. చిన్న చిన్న సెల ఏర్లు పారుతుండేవి. ఆ అడవి మా స్కూల్ కి కుడివైపున ఉండేది. మేము, మా పాఠశాల నుండి ఒకటీ నుండి రెండు ఫర్లాంగ్ల దూరం వరకు, అడవిలోకి పోయి, సీజనల్ పళ్ళు సేకరించి తినేవాళ్ళం. సీతాఫలాలు, తునికి పళ్ళు, ఇతర పళ్ళు.. వాటి పేర్లు గుర్తుకు రావడంలేదు.
ఒక రోజు 9వ తరగతి విద్యార్థులు ఐదారుగురు కలిసి, ఉసిరికాయలు తెంపుకొరావడం కోసం, అడవికెళ్ళారు. అడవిలో, లోపటి వరకు వెళ్ళి, ఉసిరికాయలు కోసుకోని.. తిరిగి వేస్తుండగా, కొండచిలువ ఎదురయింది. అదికాస్తా వీళ్ళపై ప్రతిక్రియ చెయ్యపోయింది. ఐతే, అందరూ అలట్టైయ్యారు. అందులో ఒక్కడు పక్కనే ఉన్న ఒక పది-పదహేను కిలోల బరువైన రవుతును లేపి దాని తల భాగం పై ఎత్తేశాడు. కొండచిలువ చక్కరొచ్చీ వడితిరుగుతుండగా, కడమవాళ్ళు, తమ చేతుల్లోని కర్రలతో, ఇయ్యర- మైయ్యర కొట్టారు. కొండచిలువ చచ్చింది. చచ్చిందాన్ని స్కూల్ వరకు గుంజు కొచ్చారు. అందరూ చూసి ఆశ్చర్య పోయారు. తెల్లవారి దాన్ని కాలబెట్టారు.
నేను 10వ తరగతిలోకి అడుగు పెట్టాను. మాది 1994 వ బ్యాచ్చి. ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులను, స్కూల్ తరుపున విహార యాత్రకు తిసుకెళ్ళుతారు. 1994లో సంక్రాంతి పండుగ సమయంలో విహార యాత్రకు తిసుకెళ్ళారు. హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రదేశాలు- బేగంపేట విమానాశ్రయం, గండిపేట చెరువు, హుసెన్ సాగర్, బిర్లా మందిర్, చార్మినార్, కీసరా, నాగార్జున సాగర్ కొండా, గుంటూరు జిల్లాలోని ఏపీ ఆర్ఎస్ స్కూల్ లో పడుకున్నాము.
–
— డా.బోంద్యాలు బానోత్(భరత్)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
నా కథ-12 ( గురుకుల పాఠశాల)— డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>