ఆశ(కథ)-వై .వి.సిహెచ్.లీలా పద్మజ
సీతాపురంలో ఒక గుడిసెలో ఆ రోజు పొద్దున్నే కట్టెల పొయ్యి మీద అన్నం ఉడు కుతుంది. దాలి పొయ్యి మీద కూర ఇగర డా నికి దగ్గర పడుతుంది. అద్దం లో చూసుకుంటూ బొట్టు బిళ్ళ ను సరిచేసుకుంటూ,బిగుతుగా అల్లుకున్న జడలో పక్కింటి నుండి తెచ్చి కట్టుకున్న గొబ్బి ( ముళ్ళ గోరింట) పూలమాలను తరుముకుంటూ గుడిసె బయటకు తొంగి చూసింది లచ్చి వంట ఎంతవరకూ వచ్చిందా అని. కట్టె లెగ దోస్తూ గరిట తో అన్నం కలుపుతున్న అమ్మ కనబడింది. బయట తెల్లగా తో మి బోర్లించిన సత్తు కారియర్ కన బడింది .దాన్ని చూస్తే లచ్చికెంత చిరాకో. స్టీల్ కారియర్ లో తీసుకెళ్లాలని లచ్చికి ఆశ.కానీ అది ఇప్పట్లో నెరవేరే టట్లు లేదు.లచ్చి రూపం కళగా వుంటుంది.యవ్వన పుష్టి తో చూడడానికి బాగుండడమే కాదు మళ్లీ మళ్లీ చూడాలనిపించేటట్లు వుంటుంది. లచ్చి బిల్డింగ్ పనికి కూలీగా వెళుతుంది. తన తోటి కూలీ లందరూ ఒక చోట కలుసుకొని అక్కడ నుండీ పనికి వెళతారు.
అమ్మా ! తొరగా ఇయ్యవే బువ్వ.నే బేగ పనికి బోవాల అని అమ్మని తొందర పెట్టింది. దానికి లచ్చి తల్లి యాదమ్మ ఏందే రెండు రోజుల కా న్నున్న్ డీ ఇంత తొందర పడుతున్నావ్.ఇస్తున్నా గన్ ద.ఆ పనికి ఎల్లి రావడమే మరి ఏ పని లోనూ సాయ పడవు.ఆ అద్దం ముందు సింగారాలు పోవడమే అంటూ ఏదేదో తిడుతూనే సత్తు గిన్నె కారియర్ అందించింది.అది అందుకోవడమే తడవు తుర్రు న అమ్మా! ఎల్లో త్తా నే అంటూ బయటకు పరుగు తీసింది లచ్చి. కూతురిని తిట్టిందన్న మాటే గానీ యాదమ్మ కూతురెళ్ళిన వైపే మురిపెంగా చూసుకుంటూ అనుకుంది.దీని అయ్యే బతికుంటే దాని బతుకు ఎ ట్లుండు నో. సక్క న్గా సదివించే టో డు.కానీ ప్చ్ ఆడి సావుతో దానికాద్రు ట్టం లేకపాయే. ఏదో దానికి తగ్గో న్ని సూసి మనువు సేయాల అనుకుంది.తన కుల పో ల్లు నీకేమే నీ కూతురు సక్క గంగుంటది.ఎదురు కట్నమిచ్చి మనువాడుతారు అంటూ ఆడే పరాచికాలు గుర్తొచ్చాయి.
అయితే పనిలోకి వెళ్లాలని తొందర పడి వస్తున్న లచ్చి కళ్ళు ఆ సెంటరు రాగానే ఆత్రంగా వెతికాయి. అనుకున్నట్లుగానే తాను ఎదురు చూసిన కాసేపటికి దర్జాగా అందంగా వున్న ఒక అబ్బాయి బండి మీద వస్తూ నవ్వుతూ మత్తుగా తనవైపు ఆగి ఆగి రెండు సార్లు చూడడం జరిగింది.అతను ముందుకి వెళ్లి పోయాడు.ఇలా ఈ మధ్య రెండు రోజుల నుండీ ఆ అబ్బాయి ఇటువైపు రావడం , తనని మళ్లీ చూడడం,నవ్వుతూ చూడడం ఇదంతా చూసిన లచ్చి మనసులో ఆశలు చెలరేగాయి. అదీ కాక ఆ మధ్య తను చూపించుకున్న చిలక జోస్యం గుర్తొచ్చింది.
పెద్దింటి అబ్బాయి తనను పెళ్లి చేసుకుంటాడను చెప్పింది చిలక జోస్యం. ఇంకేముంది చిలక చెప్పినట్లే ఈ అబ్బాయి తనను చూసి నవ్వుతున్నాడు.ఇక రెండు రోజులకు మాట్లాడుతాడు.మాటలతో పరిచయం పెరిగి అది కాస్తా ప్రేమగా మారి తనకు అతనితో మనువు అవుతుంది అనుకుంది లచ్చీ.ఇలా లచ్చి మనసులోని మాట తనతో పని చేసే ఇతర కూలీ స్త్రీలు గమనించారు.అది ఆనోటా ఈనోటా మేస్త్రీ కి తెలిసింది.
మేస్త్రీ మంచివాడు.సుమారు 40 సంవత్సరాల వయసు వున్నవాడు. సరే లచ్చి చెప్పిన వ్యవహారమేమిటో చూద్దాం అని ఒక రోజు లచ్చి చెప్పిన చోట ఆ అబ్బాయి వచ్చే టైం కి నిలబడి వున్నాడు.అయితే రోజూ లాగా ఆ అబ్బాయి రావడం బండి డ్రైవ్ చేస్తూ ఏదో మాట్లాడుతూ నవ్వుతూ లచ్చి వైపు ఎప్పటిలా చూస్తూ వెళ్ళడం జరిగింది. అలా ముందు కెల్లిన ఆ అబ్బాయి నీ ఆపి మేస్త్రీ అసలు విషయం అడిగాడు. దానికి ఆ అబ్బాయి చెవులలో వున్న ఇయర్ ఫోన్స్ తీసి చూపిస్తూ ఇదిగో వీటి ద్వారా నేను నా లవర్ మాట్లాడుతున్న మాట్ల్ని సెల్ ఫోన్ చేతిలో లేకుండా వినగలుగుతున్నాను. ఆమెతో మాట్లాడుతూ ఆ నవ్వు మొహం తో దారి కనబడిన ఈమె వైపు చూడడం జరిగింది. అది కూడా గత వారం రోజుల నుండీ నేను ఈ దారి లోనే రావడం వల్ల రోజూ ఈమె నాకు కనబడం ఎలా జరిగిందో నేను చూడడము అలాగే జరిగింది. అంతే గానీ మరో వుద్దేశ్యం కాదు .నాకూ నా లవ్వర్కి పెళ్లి కుదిరింది
నా ప్రవర్తన మీకు అపార్థం కల్గిస్తే క్షమించండి అంటూ ముందుకెళ్ళిపోయాడు. నిర్ఘాంత పడడం లచ్చి వంతు అయింది.
-వై .వి.సిహెచ్.లీలా పద్మజ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
ఆశ(కథ)-వై .వి.సిహెచ్.లీలా పద్మజ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>