ప్రతి అక్షరము అందమైన రహస్యమే(కవిత) – చందలూరి నారాయణరావు
నమ్మకమనేది
బతుకు దుకాణంలో
హృదయ తీరంలో దొరికే
అతి విలువైన వస్తువు…
నిజమనేది
కళ్ళు మనసు లోతును
ఈది చేరుకునే
ఓ సురక్షిత ప్రమాణం…
మనసు
ఓ చీకటి గదిలో
సంచరించే రహస్య సంచారి..
నచ్చిన రాకతో వెలిగే పచ్చని దీపం
నచ్చడం అంటే
మెచ్చుకోవడం కానే కాదు.
తన మనసు పోలికలను
జత చేసుకునే ఓ ఊహ
వంద అడుగుల్లో
ఒక్క అలుపు చెప్పే మాట
ఇంకో అడుగు అప్పు తీసుకుని
ముందుకు పొమ్మని .
నిద్ర రాలేదంటే
ఏదో ఒక ఆలోచన మధ్య
మనసు ఇరుక్కుని
నలగడమే
ఓ పరిచయం భారీవర్షంలా
మాటల వరదలో
కొట్టుకుపోతూ
నమ్మకం గల్లంతు
అసహ్యంగా కనిపించే
మనసును పుస్తకంగా చదివితే
ప్రతి అక్షరం
ఓ అందమైన రహస్యమే
బాగా పాచి పట్టిన
అనుభవంపై
కాలు పడ్డప్పుడలా
విరిగిన వాక్యమే గొప్ప కవిత.
రోజంతా ఊపిరాడని
అలసటకు
అచ్చు తప్పుపడ్డ పదాలు
కూర్చిన అర్థమే ఔషధం.
… చందలూరి నారాయణరావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
ప్రతి అక్షరము అందమైన రహస్యమే(కవిత) – చందలూరి నారాయణరావు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>