బరి పాదాలు (కవిత) – కొలిపాక.శోభారాణి
పసి గుడ్డుగా ఉండి
ఎదపై మర్దన చేసిన
చిన్ని పాదాల స్పర్శతో
గుండెలోతుల్లో పొంగిన
సంతోషపు అల ఎగిసి
అనంతమై నిలువెల్లా
తడిపిన తడిపేసిన తడి
క్రమేణా మొగ్గనుండి పువ్వు
గా మారే క్రమంలో తీర్చిదిద్ది
నట్టు పొందికగా ఆకృతి దాలుస్తున్న..
పరంపర చిన్నిపాదాలకి వెండిపట్టీలుపెట్టి
పడ్డ సంబురం అంతా ఇంతా
కాక దోసిల్లలో నిండి ఇల్లంతా
ముంచెత్తింది గల్లు..గల్లున
నడిచి వస్తుంటే ప్రాణం లేచి
వచ్చి మంజులంగా చెవిని
చేరేది మొగ్గై,పువ్వై ఇంద్ర
ధనస్సు రంగులన్ని అలదు కొన్న
సుమబాల కాళ్ళను కడిగి ధారబోసి
ఉన్నత భవితను కలగంటూ..
విదేశానికి తోడునిచ్చి..పంపిన
గుండెల్ని గుప్పిట్లో పెట్టుకొని
ఇప్పుడు అవసానం ఆవరించి న సమయం..
చిరుపాదాల మంజీరనాథ చప్పుడుకై
గుండె గొంతుకలో కొట్లాడు తుంది దీపం రెప రెప మంటూ
-కొలిపాక.శోభారాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
బరి పాదాలు (కవిత) – కొలిపాక.శోభారాణి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>