సంతకత్వం -(కవిత)- కట్టా వేణు
సంతకమంటే..
నీ అస్తిత్వం
నీదైన తత్వం
ఒక సంతకం తేలిగ్గా కనిపించొచ్చు
ఇంకోటి ఓ చిక్కు ప్రశ్నలా!
అచ్చు మనిషి అంతరంగం లానే!
ఒకరి సంతకం మరొకరికి పిచ్చి గీతే
కానీ అది చేసిన వారికే తెలుసు
ఏ మలుపులో ఏం దాగుందో!?
అదీ ఓ అంతు చిక్కని మానవ ప్రవర్తన!
వేయి మంది ఏక నామధేయుల సంతకాలు సైతం
వేయి రకాలుగా ఉంటాయి
పేర్లు ఒకటేనేమో
తీర్లు ఒకటవ్వాలని లేదుగా!
సంతకానికింతనీ
ధర కట్టి అమ్ముతాడో దౌర్భాగ్యుడు!
అదీ తను కన్న బిడ్డేనని
తెలిస్తే ఏమౌతాడో పిచ్చివాడు!!
ఒకటి గుర్తు పెట్టుకో
నీ సంతకం ఏ రంగు సిరాతో ఉన్నా…
ముద్రను బట్టే దాని విలువ!
నువ్వెంత గొప్పోడివైనా…
నీ తోటి వారి మీద నువ్వేసే
ముద్రను బట్టే నీకు విలువ!!
– కట్టా వేణు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సంతకానికింతనీ
ధర కట్టి అమ్ముతాడో దౌర్భాగ్యుడు!
అదీ తను కన్న బిడ్డేనని
తెలిస్తే ఏమౌతాడో పిచ్చివాడు!!
బాగుంది సార్