* ‘విహంగ’ మీ రచనలకి ఆహ్వానం పలుకుతోంది. చక్కని శైలితో ,కొత్తదనంతో,విశాల భావాలతో ,మహిళల మానసిక వికాసానికి,మహిళల సమస్యలపై…వివిధ సాహిత్య ప్రక్రియలపై… రచనలను మీరు మాకుపంపవచ్చు.
* కథ, కవిత ,గేయం ,వ్యాసం,పాటలు, సమీక్షలు ,కార్టూన్లు,జోక్స్,వింతలు-విశేషాలు,పజిల్స్, జనరల్‍నాలెడ్జ్, మొదలైనవి ఆహ్వానిస్తున్నాం.కొత్తగా రాసేవారికి ప్రోత్సాహం వుంటుంది.
‘విహంగ’ ప్రారంభ సంచిక నుంచీ పత్రికని ఆదరిస్తున్న అందరికీ కృతఙ్ఞతలు.
ఈ పత్రిక ప్రధానంగా మహిళల సమస్యలు,మనోభావాలు,సృజనాత్మక రచనల కోసం ఏర్పాటు చేసుకున్నది.
అయితే-
‘విహంగ’లో మా రచనలకి తావు లేదా ? అంటూ చాలా మంది పురుషులు ఇ-మెయిల్ పంపారు.’విహంగ’లోరాయటానికి ఉత్సాహం చూపుతున్నారు.చాలామంది ఇప్పటికే తమ రచనలు పంపారు.
అందుకే మే 2011 నుంచి ‘విహంగ’లో పురుషుల కూడా తమ రచనలను పంపవచ్చును.
పురుషులు పంపే రచనలు ‘ స్త్రీల అభ్యున్నతి, మనోవికాసం,స్త్రీల సమస్యలు , ఔన్నత్యాన్ని’వ్యక్తీకరించేవిగావుండాలి.స్త్రీలను కించపరిచే భావజాలానికి,ఇతర అంశాలకు చోటు లేదు.
నియమ నిబంధనలు:
* విహంగలో మీ రచనలు ప్రచురించాక 30 రోజుల వరకు మీ సొంత బ్లాగులలో,లేదా సైట్ల లో పెట్టుకో రాదు.
అయితే ప్రచురించిన వెంటనే విహంగ లోని మీ రచనల లింక్ ని పెట్టుకొని ,30 రోజుల తర్వాతే పూర్తి రచనని మీ సైట్ల లో పోస్ట్ చేసుకోవచ్చు.
* మీ రచనలను యునికోడ్ ఉపయోగించి వర్డ్ లో టైప్ చేసి పంపవచ్చు.
*అక్షరమాల,లేఖిని,బరహ, మాండలి వంటి సాఫ్ట్ వేర్ లను ఉపయోగించి లేదా నేరుగా మీ జి మెయిల్ లో తెలుగు ఎనేబుల్ చేసి అక్కడే టైపు చేసి కూడా పంపవచ్చు.
* దయచేసి పి.డి.ఎఫ్ రూపం లో గానీ, చేతిరాతలో కానీ రాయబడినతెలుగు రచనలను పంపవద్దు.
వాటిని తిరిగి టైపు చెయ్యాల్సి వస్తుంది కాబట్టి సహకరించండి.
* మీ అమూల్యమైన సలహాలను,సూచనలను తెలియజేయండి.
* మీ రచనలు పంపవలిసిన చిరునామా: editor.vihanga@gmail.com
-మీ విహంగ
~@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@