“ఆధునిక తెలుగుసాహిత్యంలో విభిన్నప్రక్రియలు,వాదాలు-సమాలోచన అంతర్జాతీయసదస్సు”
కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం(KLU)లో, ఆర్ట్స్ విభాగం,బి.ఏ.(IAS),వడ్డేశ్వరం,గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ మరియు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం,నెల్లూరు,(భారతీయ భాషాసంస్థ,మైసూరు) సంయుక్త ఆధ్వర్యంలో 10,11 ఏప్రిల్ 2025 న ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియలు, వాదాలు – సమాలోచన” అనే అంశంపైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలలోని ఆచార్యులు,పరిశోధకులు, డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్యంలోని వివిధ కవిత్వ ఉద్యమాలైన భావ, అభ్యుదయం,విప్లవ కవిత్వాలు, దళిత కవిత్వం, స్త్రీవాద కవిత్వం, మైనారిటీ కవిత్వం, కథానిక, నవల, వచన కవిత్వం, హైకూలు, నానీలు, లౌకిక విలువల ప్రభావం మొదలైన అనేక ప్రక్రియలపై 157 పరిశోధనా పత్రాలు సమర్పించారు.
ఈ సదస్సుకు రెండోవరోజు ముఖ్య అతిధిగా హాజరైన ప్రపంచ తెలుగు రచయితల ప్రధాన కార్యదర్శి డా.జి.వి.పూర్ణచంద్ మాట్లాడుతూ,సాహిత్య మనేది విశ్వ శ్రేయస్సును కాంక్షించేదై ఉండాలన్నారు. ఒకప్పుడు రాజులు,రాణులు,దేవుళ్ళు, ప్రబంధ నాయికలకు ప్రధానంగా పరిమితమైన సాహిత్యం ఆధునిక కాలంలో సమాజ అవసరాలకు అనుగుణంగా మారుతూ వస్తోందన్నారు. విశిష్ఠ అతిధిగా హాజరైన కమీషన్ ఆఫ్ కాలేజియెట్ ఎడ్యుకేషన్ విద్యాధికారి డా.టి.జాన్ కిరణ్ బాబు మాట్లాడుతూ,నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విద్యావ్యవస్థలో ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు.ఏ జాతి సంస్కృతి అయినా పదికాలాల పాటు నిలబడాలంటే ఆ ప్రాంత భాషా, సాహిత్యాలే మూలమన్నారు. కె.ఎల్.యు,ఆర్ట్స్ విభాగాధిపతి డాక్టర్.బి.శివనాగయ్య మాట్లాడుతూ,యు.పి.ఎస్.సి, ఏ.పి.ఎస్.పి.,సిలబస్ లకు అనుగుణంగా ప్రధానమైన అన్ని పాఠ్యాంశాల్లో ఇటువంటి జాతీయ, అంతర్జాతీయ నదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు కన్వీనర్ గా డా. అద్దంకి ప్రజాపతి ఉన్నారు. సదస్సు ముగింపులో ప్రశంసా పత్రాలను అందచేశారు.
ఈ సదస్సు రెండవరోజున డా.ఆర్.శ్రీనివాసరావు,తెలుగు అధ్యాపకులు, మారీస్ స్టెల్లా కాలేజీ, విజయవాడ. “ఆధునిక తెలుగు సాహిత్యంలో లౌకికవాదం” అనే పరిశోధన పత్రాన్ని సమర్పించి, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
ఈ సదస్సుకు సంబంధించిన ఉపన్యాసలను చూడాలనే ఆసక్తి ఉన్నవారు ఈ కింది లింకు లో చూడగలరు.
https://youtu.be/HOFzl8fdBjU?si=Aw8Vx3uJz9GNkRfD
-విహంగ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
“ఆధునిక తెలుగుసాహిత్యంలో విభిన్నప్రక్రియలు,వాదాలు-సమాలోచన అంతర్జాతీయసదస్సు” — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>