అంబేద్కర్ ఆలోచనల తాత్వికత – ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక
సామాజిక చలనాలను గుర్తించడం, వాటిని అవగాహనలోకి తెచ్చుకోవడం, సమాజ సాహిత్యాల పరస్పర ప్రమేయాలను విశ్లేషించుకోవడం ప్రరవే ఆచరణలో ముఖ్యమైన అంశం. గత పదహారేళ్లుగా వివిధ మార్గాలలో ఆ పని జరిగింది. అందులో భాగంగా స్త్రీవాద సాహిత్య విమర్శ, ఆదివాసీ జనజీవనాల మీద అంతర్జాలంలో ఏర్పాటు చేసిన ప్రసంగాలు- ప్రరవే సభ్యులు, కలిసి వచ్చేమిత్రులతో చేసిన సుదీర్ఘ సంభాషణలు. దానినుంచి నేర్చుకున్న అనుభవంతో, మిత్రుల ప్రోత్సాహంతో అంబేద్కర్ ఆలోచనల అధ్యయనం కోసం ప్రరవే సంకల్పించింది.
వర్తమానంలో పీడితవర్గాలకి భరోసానిచ్చే అంశం అంబేద్కర్ ఆలోచనలు. ఇదే సమయంలో కులమతతత్వ రాజకీయవాదులు అంబేద్కర్ని సొంతం చేసుకోవడం ద్వారా అంబేద్కర్ వాదుల ఓట్లను తమకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆచరణలో అంబేద్కర్ భావాలకి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తూ రాజకీయాల కోసం మాత్రం ఆయన విగ్రహాలను పూజించడంలోని ద్వంద్వాన్ని ప్రశ్నించాలి.
‘దడి కట్టుకున్న వర్గమే కులం’, ‘ఒక సమాజపు ప్రగతిని ఆ సమాజంలోని మహిళలు సాధించిన ప్రగతితో కొలుస్తాను’ వంటి అంబేద్కర్ చేసిన ఎన్నో పరిశీలనలు ఈ కాలానికి కూడా ప్రాసంగికమై ఉన్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహించిన పీడిత కులాల గురించి ఆలోచనలు చేసి, వారి సమానత్వ సాధనకి పునాదులు తీసి ఊరుకోలేదు. అక్కడ నిలబడి స్వేచ్చా సమానత్వాలతో కూడిన సవ్యమైన జాతి మొత్తం నిర్మాణం కోసం, అందుకు అవసరమైన చట్టబద్ధమైన మార్పుల కోసం కృషి చేశారు. దేశీయ స్థితిగతుల పట్ల ఎరుకతో రాజ్యాంగ రచనకి కీలకమై నిలిచారు. న్యాయవ్యవస్థలో మార్పులు, రిజర్వేషన్లు, ప్రజాస్వామిక దృక్పథం, పీడిత వర్గాల హక్కులకి రక్షణ కవచమై నిలవడం వంటి అనేక కారణాల వలన రోజురోజుకీ అంబేద్కర్ ఆలోచనల అవసరం పెరుగుతూనే ఉంది.
అంబేద్కర్ ఆలోచనల ప్రతిఫలంగా మనకి మిగిలిన వేల పేజీల రచనలు, వందల గంటల ఉపన్యాసాల నుంచి వర్తమాన ప్రాసంగికతను కూడా దృష్టిలో పెట్టుకుని 38 ప్రసంగ అంశాలను రూపొందించాము. ప్రారంభ, ముగింపు సభల్లో నేపథ్య, సారాంశ ప్రసంగాలు 10. మొత్తంగా 48 ఉపన్యాసాలను 21 వారాల్లో వినబోతున్నాము. ఆలోచనాపరులు అధ్యయనశీలురు అయిన 48 మంది వక్తలు అంబేద్కర్ ఆలోచనల మీద సమగ్ర అవగాహనని కలిగించి, కొత్త చూపుని ప్రసరించడానికి సిద్ధమవుతున్నారు. తేదీ 22-12-2024 నుంచి 18-05-2025 వరకూ ప్రతీ ఆదివారం ఉదయం 10.00 నుంచీ మధ్యాన్నం 1.00 అంతర్జాల మాధ్యమం ద్వారా అంబేద్కర్ ఉపన్యాసాల సీరీస్ జరగనున్నది. మిత్రులందరినీ ఈ పరంపరలో భాగం కమ్మని కోరుతున్నాము. మనందరి మధ్య జరిగే సంభాషణ, చర్చ ద్వారా అంబేద్కర్ పట్ల మన అవగాహన మెరుగు పడుతుందని ప్రరవే ఆశిస్తున్నది.
ప్రసంగాల వరుస
- ప్రారంభ ఉపన్యాసం * అంబేద్కర్ ప్రాసంగికత * అంబేద్కర్ జీవితం, వ్యక్తిత్వం * ఆచరణశీలి అంబేద్కర్ * జాతీయోద్యమ ఘట్టాల్లో అంబేద్కర్ ఆలోచనలు * పూనా ఒడంబడిక * దేశ విభజన రాజకీయాలు * రాజ్యాంగం, రాజ్యాంగ సంస్కరణలు- అంబేద్కర్ * అంబేద్కర్- చిన్నరాష్ట్రాలు * ముస్లిం మైనార్టీల గురించి అంబేద్కర్ * ఆదివాసీ వనరుల గురించి అంబేద్కర్ * కార్మికుల స్థితిగతులు సంక్షేమంపై అంబేద్కర్ ఆలోచనలు * హిందూ మతం – తాత్వికత * మనుధర్మశాస్త్రం & హిందూ పురాణాలపై అంబేద్కర్ విశ్లేషణ * కులమతాల పరిణామ క్రమంలో వేద, పురాణాల పాత్ర * సామాజిక పరిణామక్రమంలో స్త్రీ – అంబేద్కర్ అవగాహన * శూద్రులు, అస్పృశ్యులు – ఇండో ఆర్యన్ సమాజం * అంటరానితనం – భిన్నకోణాలు * అస్పృశ్యుల విముక్తి – కాంగ్రెస్, గాంధీ * భారతదేశంలో కులం, కులనిర్మూలన * దళితుల విద్యా ఉద్యోగ, రాజ్యాధికారాల గురించి అంబేద్కర్ * దళిత స్త్రీ సంక్షేమంపై అంబేద్కర్ * ఒబిసిల సాధికారతపై అంబేద్కర్ * హిందూ కోడ్ బిల్ * మహిళాభ్యుదయం – అంబేద్కర్ * ప్రాచీన భారతదేశంలో విప్లవం – ప్రతి విప్లవం * బుద్ధుడు, అతని ధర్మం * బుద్ధుడు, కార్ల్ మార్క్స్ తులనాత్మక పరిశీలన * రస్సెల్ సమాజ పునర్నిర్మాణం * నాయకారాధనపై అంబేద్కర్ చర్చ * భారతదేశంలో కమ్యూనిజం – అంబేద్కర్ * భారత సోషలిస్టులతో అంబేద్కర్ * అంబేద్కర్ ఆర్థిక దృక్పథం * అంబేద్కర్ చారిత్రిక దృష్టికోణం * ప్రజాజీవితంలో నైతికత అంబేద్కర్ భావనలు * భారత సమాఖ్య వ్యవస్థ వికేంద్రీకరణ * జాతీయవాదం – అంబేద్కర్ * సాధారణ, భారతదేశ ప్రజాస్వామ్యం – అంబేద్కర్ * భారత వ్యవసాయ, పారిశ్రామిక విధానాలు * భారత న్యాయ, విద్యావ్యవస్థలు * భాషా సాహిత్యవేత్తగా అంబేద్కర్ * మంత్రిగా, శాసన సభ్యునిగా అంబేద్కర్ * అంబేద్కర్ సారాంశం * అంబేద్కర్ సీరీస్ సమీక్ష 1 – 8 * అంబేద్కర్ సీరీస్ సమీక్ష 9 – 16 * అంబేద్కర్ సీరీస్ సమీక్ష 17 – 24 * అంబేద్కర్ సీరీస్ సమీక్ష 25 –32 * అంబేద్కర్ సీరీస్ సమీక్ష 33 –38
–ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
అంబేద్కర్ ఆలోచనల తాత్వికత – ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>