’’విహంగ” తొలి తెలుగు మహిళా వెబ్ పత్రిక
ఇది మహిళా పత్రిక . దీని ఉద్దేశం ఏమిటి?అనే సందేహం పాఠకులకు రావటం లో ఆశ్చర్యం లేదు
.అంతర్జాలం లోమహిళల కోసం ఒక్క వెబ్ పత్రిక కూడా లేకపోవడమే ఈ ప్రయత్నానికి కారణం.
ఉన్న ఒకటి , అరా పత్రికలు కూడా ప్రింట్ మీడియా నుంచి వెబ్ కి తరలించబడ్డవే.
అయినా స్త్రీల సాహిత్య పరిమాణం కొరతగానే ఉన్నందు వల్ల ఇంకా విరివిగా స్త్రీల సాహిత్యం,
పత్రికలు అంతర్జాలంలో కాలు మోపాలని మా ప్రగాఢ వాంఛ.
మా ప్రయత్నంగా … పలు సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్న…
‘మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీ’ సంస్థ ఆధ్వర్యం లో తెలుగు మహిళల భావోద్వేగాలకు
వేదిక గా ‘విహంగ’ ని తొలి తెలుగు వెబ్ పత్రికగా 11-1-11(2011)న అంతర్జాలపు వినువీధుల్లో
సగర్వంగా ఎగరేస్తున్నాం.
‘విహంగ’ వ్యక్తి స్వేచ్ఛను , అక్షర స్వేచ్ఛను గౌరవిస్తుంది.
విశాల భావాల పట్ల ఆదరణ చూపుతుంది.వైజ్ఞానిక ,మనోవికాసానికి స్వాగతం పలుకుతుంది.
కళాత్మకమైన, భావనాత్మకమైన సంవేదనల్ని తమ సంఘర్షణల్ని అక్షర రూపం లో ప్రకటించే
సృజనకారులని ఆహ్వానిస్తుంది. అరమరికలు లేని స్నేహ హస్తాన్ని అందిస్తుంది.*
సారధ్యం:
వ్యవస్థాపకురాలు :
డా.హేమలత పుట్ల
సంపాదకులు :
మానస ఎండ్లూరి
డా.అరసి శ్రీ
సంపాదక వర్గం:
* * * * *
సహాయ సహకారాలు :
వెంకట్ కట్టూరి
డా.భోజన్న తాటికాయల