చెప్పేవన్నీ జీవిత సత్యాలే (కవిత)–వెంకటేశ్వరరావు కట్టూరి
ఓ నిత్య గాయాల నెలవంకా
నేనో పిరికివాణ్ణి
నీలాగా ప్రేమించడం చేతకాని వాణ్ణి
గుండెకు గాయం చేయని చోట కొన్నాళ్ళైనా జీవించు
నీ కోసం
మనసు మండలమంతా వెతికాను
‘నిన్నొకసారి చూస్తే చాలు
ఆ కళ్ళు అలా మూసుకుపోతాయి’
ఒక పరిమళ కాలం
బ్రతికే పూవునైనా బావుండేది
క్షణ కాలం రాలిపోయేవాడిని
నా తెలి వెన్నెల తోకాచుక్కా
నేనో ప్రవాహాన్ని
తడి ఆరని వాక్యమొకటుంది
మనసులో పూదోటలో
పదిలంగా భద్రపరచు
రాసేవన్నీ జీవిత పాఠాలే
చెప్పేవన్నీ జీవిత సత్యాలే
ఆ జ్ఞాపకాల దొంతరలో
తరగని నీ చిరునవ్వులకి
సజీవ సాక్ష్యంగా
మనసు తెరల మాటున
పదిలంగా అదిమిపెట్టు.
-వెంకటేశ్వరరావు కట్టూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
చెప్పేవన్నీ జీవిత సత్యాలే (కవిత)–వెంకటేశ్వరరావు కట్టూరి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>