మేలుకో దామగుండమా (కవిత)- శ్రవణ్
మేలుకో దామగుండమా
కనీసం నీవు అయిన మేలుకో
రాజకీయ నేతల నుండి ప్రభుత్వ అధికారుల వరకు
అభివృద్ధి అనే మాయలో పడి నిద్రిస్తున్నారు
నీవు వనం కాదు వర్షాధారమని చెప్పు
నీవు వృక్షం కాదు వరమని చెప్పు
నీవు వనమూలికల, జీవరాసుల నిలయమని చెప్పు
వాయువు, జలాలను వృధ్ధి చేసే పరిశ్రమవని చెప్పు
మేలుకో దామగుండమా
కనీసం నీవు అయిన మేలుకో
నావి రేడారు కోసం రేడియేషన్ తరంగాలను పుట్టిస్తున్నారు
ఎవరి స్వార్థం ఎవరికి నష్టమిక్కడ?
మరిచార! పూర్వపు చరిత్రని
ఎన్ని మరణాలకి కారణమో ఈ రేడియేషన్ ప్రభావం
ఎన్ని రోగాలకు మాధ్యమమో
హైదరాబాద్
నగరపు హృదయాన్ని చీల్చుతున్నారు వీరు
ఇన్నాళ్ళు ఊపిరి పోసిన వనం ఊపిరినే ఆపుతున్నారు
నేల తల్లిలో ఇమిడిన వేర్లను జరుపుతున్నారు
కేవలం లక్ష తొంబై వేల చెట్లే అంటూ నరికివేస్తున్నారు
వందల ఏండ్లు కలిగిన వృక్షాలను హత్య చేస్తున్నారు
ఎవరూ ప్రశ్నించట్లేదు దామగుండమా
కనీసం నీవు అయినా మేలుకొని ప్రశ్నించు
పిరికితనంతో జనాలు
స్వార్థంతో అధికార నాయకత్వాలు
చనిపోబోతున్న మాట్లాడలేని జీవాలు
మేలుకొని తిరిగి ప్రశ్నించు దామగుండమా
ఇంత జరుగుతున్నా చలించని పక్షవాతపు దేహాల నడుమ
కనీసం నీవు అయినా మేలుకో దామగుండమా
మేలుకో
— శ్రవణ్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
మేలుకో దామగుండమా (కవిత)- శ్రవణ్ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>