అనురాధ యలమర్తికి అభినందన సత్కారం

సీనియర్ సిటిజన్ ఫోరం గాయత్రీ నగర్ వారు ఆగస్టు 31వ తేదీన, ప్రభుత్వం వారికిచ్చిన బిల్డింగులో ప్రతి నెల జరుపుకునే జన్మదిన వేడుకలుతో పాటు వినాయకునికి పూజలు జరిపి నిమజ్జనం కూడా నిర్వహించారు. ప్రతి సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్ లో నిష్ణాతులను గుర్తించి వారికి అభినందన సత్కారం నిర్వహిస్తారని సెక్రటరీ విఠల్ గారు తెలియజేస్తూ ఈ సందర్భంలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధ గారు గతంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఉగాది పురస్కారం అందుకున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని
వందకు పైగా అవార్డులు తెచ్చుకొని రచయిత్రిగా గుర్తింపు పొందిన ఆమె మన గాయత్రీ నగర్ నివాసి అని తెలిపారు. సభ్యులు సీత గారు, మంజుల, ఉమ, విజయలక్ష్మి, పద్మావతి తదితర మహిళలందరూ కలిసి రచయిత్రి యలమర్తి అనూరాధను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గాయత్రీ నగర్ వాసులు తన అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారని,వారిలో బి. ఎల్. ప్రసాద్ గారు,విఠల్ గారు, మరెందరో ఉన్నారని రచయిత్రి అనూరాధ గారు గుర్తు చేసుకున్నారు. తామంతా అన్నదమ్ములవలె, అప్పచెల్లెళ్లవలె కలిసిమెలిసి ఉంటున్నామని, ఒకరికొకరు తోడ్పాటు నిచ్చు కుంటున్నామని తెలియజేసారు. ముఖ్యమంత్రిగా విచ్చేసిన కృష్ణారావు గారు, ఫారం అధ్యక్షులు సూరిబాబు గారు, కమిటీ మెంబర్ వైయస్సార్ ప్రసాద్ రావు గారు తదితరులు ఆమెకు అభినందనలు తెలియజేశారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
అనురాధ యలమర్తికి అభినందన సత్కారం — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>