నా కథ-13 -(గురుకుల పాఠశాల) — డా.బోంద్యాలు బానోత్(భరత్)

నేను 10వ తరగతిలోకి అడుగు పెట్టాను. ఎన్నో ఇబ్బందులు పడి, బడిలో అడుగు పెట్టిన నాకు, ఇప్పుడు 10 వ తరగతిలోకి అడుగు పెడుతుంటే, ఏదో సాధించాననే అనుభూతి కలిగింది. మొదటి రోజే, ’10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్సవ్వాలి’ అని ఒక సంకల్పం తీసుకున్నాను. అందుకు అనుగుణంగా కష్టపడి చదవాలని నిర్ణయించుకున్నాను. నాకు తోడుగా, నా మిత్రుడు ‘రవిందర్’ ఉండేవాడు.
నాది ‘గురుకుల పాఠశాల’ (గిరిజన) . అందులో చదివే మాకు అన్ని రకాల వసతులు ఉండేవి. ఇక చదవడమే మా కర్తవ్యంగా భావించాము. ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా, చూసుకునేవాళ్ళం. నేను బాగా కష్టపడి చదువుతూ, ఫస్ట్ క్లాస్ లో పాసైయ్యే వాన్ని. ఆంటే, 60-70 మార్కుల మధ్య వచ్చేటివి. కాని అప్పుడప్పుడు క్వార్టర్లీ లేదా ఆఫీయర్లీ పరీక్షల్లో మ్యాథ్స్ లో బార్డ్ లో పాసైయ్యేవాడిని. బయోలోజిలో 50 మార్కులకు 45 మార్కులు వచ్చేవి.
ఐతే, మేము 10 వ తరగతి, చదువుకుంటూనే ఇంటర్ మిడియట్ లో ఏ గృప్ తీసుకొవలో ఆలోచించే వాళ్ళం. మా క్లాస్ వాళ్ళు దాదాపుగా 30మందీలో 15నుండీ 20 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కావాలని అనుకునే వారు. దాని కోసం ఇంటర్ మిడియట్ లో ‘ఎంపీసీ’ గృప్ తీసుకుని చదవాలని, దానికోసం 9 మరియు 10 వ తరగతినుండే ‘మాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ’ బాగా కష్టపడి చదవాలని, తద్వారా ఇంటర్ మీడియట్ లో కూడా ఉపయేగ పడుతుందని భావించే వాళ్ళు. మా సార్లు కూడా ప్రొత్సహించేవారు. అన్నీ సబ్జెక్టులను ఈక్వల్ గానే చదివే వాళ్ళం. ఉన్న సమయంలోనే , కాస్తా ఎక్కువ సమయం మాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ… కి కెటాయించే వాళ్ళం. పరీక్షలు దగ్గిర పడుతున్నా కొద్ది, చదవడం, రాయడం అభ్యాసం చేసేవాడిని. నాకు మ్యాథ్స్ కంటే సైన్స్ లో ఎక్కువ మార్కులు వచ్చేవి. మ్యాథ్స్ లో కొన్ని అధ్యాయాలు చాలా సులభంగా అర్థమయ్యేవి. మరికొన్ని అర్థమయినట్టూ, అర్థమయ్యేటివి కాని చెయ్యబోతే, ఒక లెక్కా సగంవరకు చేసేవాడిని, ఆ తరువాత ఎక్కడో ఒక చోట స్టక్కైపోయేది. మళ్ళీ దాన్ని కంప్లీట్ చెయ్యడానికి, మా మితృలను అడిగి, తెలుసుకొని కంప్లీట్ చేసేవాడిని.
ఆ విధంగా చదువుతుండగా.. రోజులు గడుస్తున్నాయి.
చివరిగా 10వ తరగతి ఫైనల్ పరీక్షల తేది రానేవచ్చింది. పరీక్షా సేంటర్ ‘ఏటూరు నాగారం’ హైస్కూల్లో పడింది. ఆ స్కూల్ మా ‘గురుకుల పాఠశాల’ నుండీ మూడు కిలోమీటర్లకంటే దూరముంటుంది. ఒళ్ళుమండేలా ఎండకొడుతుంది. పరీక్షలకు ముందురోజు మా ప్రిన్సీపాల్ ఒక మీటింగ్ పెట్టీ, పదవతరగతి పరీక్షా రాసేవాళ్ళకి, తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పుతూ-‘ప్రతి విద్యార్థి దగ్గిర ఒక ‘గ్లుకోన్డీ’ ఉండాలి. పరీక్షా సెంటర్ కి అరగంటా ముందే చేరుకొవాలి. అడిగిన ప్రశ్నలన్నీటికి జవాబులు రాయాలి. చాలా జాగ్రత్తగా టైమ్ మేనేజ్ చేసుకోవాలి..’.
ఐతే, పరీక్షా రోజున తొందరగా లేచి, కాల్లకృత్యాలు తీర్చుకోని, సమయానకి అల్పహారము చేసుకొని, హాల్ టికేట్ జెబులో పెట్టుకొని, చేతిలో రైటింగ్ ప్యాడ్ పట్టుకొని, పరీక్షా సెంటర్ కు బయలు దేరాము. ఫ్రెండ్స్ వారిగా, గౄపులుగా, వారి వారి వీలును బట్టీ, కొందరు షార్ట్ కట్లో మా స్కూల్ నుండీ మడికట్లల్లోపడి, సీనీమాహాల్ గడ్డవద్ధా రోడ్డుకు చేరుకొని, అక్కడనుండి పరీక్షా సెంటర్ కు వెళ్ళేవాళ్ళు. నేను రవిందర్, శంకర్.. ఈ షార్ట్ కట్ మార్గంలోనే వెళ్ళేవాళ్ళం. కిందకూర్చోని పరీక్షలు రాసినాము. మేదటిరోజు ‘తెలుగు’ సబ్జెక్ట్, ప్రశ్న పత్రం చూడగానే, అన్ని చదివినయే రావడంతో, బ్రహ్మాణంగా రాశాను. మా స్కూల్ వాళ్ళు అంధరూ బాగానే రాస్తున్నారు. కాని కొంతమంది కోయ పిల్లలు, క్లాస్ కు సరిగ్గా అటేండ్కాని వారు, కొంచం ఇబ్బంది పడ్డారు. కనీసం పాస్ మార్కుల కోసం కష్టపడేవాళ్ళు. అప్పటిదాకా ‘లంబాడి బంజారా’ విద్యార్థులతో గొడవపడిన ‘కోయ-గోండు’ పిల్లలు కానిసం పాస్ మార్కులకోసం, మళ్ళీ ‘లంబాడి బంజారా’ విద్యార్థులతో సక్యత కుదుర్చుకొనేవాళ్ళు. పరీక్షలు రాసేటప్పుడు ‘లంబాడి బంజారా’ విద్యార్థుల సహాయం కోరేవాళ్ళు.
తద్వారా కనీసం పాసైయ్యేవాళ్ళు. ఆవిధంగా, చూస్తూండగానే, ఒకదాని తర్వాత ఒకటి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, సోషల్ అన్నీ పరీక్షలు విజయవంతంగా రాశాను. చివరి పరీక్ష రాసి, పేపరిచ్చేసిన తర్వాత నుండి మనుసులో ఒక రకమైన ఫీలింగ్ మొదలైంది. ‘ ఈ రోజుతో, నాకు, ఈ ఊరికి, ఈ స్కూల్ కి ఉన్న బంధం తెగిపోతుంది. మళ్ళీ ఇటువైపుకు వస్తామో! రామో!’ అని అనిపించింది. కాస్త ముందుకు, అంటే ‘ఏటూరు నాగారం’ ప్రభుత్వ హైస్కూల్ నుండి మా గురుకుల పాఠశాలకు వస్తుండగా.. సినిమాహాల్ గడ్డకు చేరుకొనగా, ఆ సినిమా హాల్ ను చూసి,’ ఎప్పుడైనా సినిమా చూడాలనిపిస్తే 5 రూపాయలు ఉంటే చాలు, సినిమా చూసేవాళ్ళం. ఈ రోజుతో, ఈ సినిమా హాల్ తో, మనకున్న బంధం తెగిపోతుంది.’ అని నా మనసులో ఏదో నాకు తెలియని బాధ, దుఃఖం కలుగసాగింది. రేపటి నుండి నేను నాదైన ప్రదేశం, నాదైన పాఠశాల, ఆ పాఠశాల ప్రాంగణం, ఆ పాఠశాలను ఆవరించి ఉన్న ప్రకృతి, వాగులు వంకలు.. వీటికన్నీటికీ దూరమై పోతున్న అనే భావన నన్ను బాదించసాగింది.
ఆరోజు చివరి పరీక్ష రాసి గురుకుల స్కూల్ కి వచ్చేశాను. మరునాడు తెల్లారితే పదవతరగతి పరీక్షలు అయిపొయిన వాళ్ళందరు, తమ తమ ఇంటికి బయలుదేరుతారు. కాబట్టి ఆరోజు సాయంత్రం 9వ తరగతి విద్యార్థులు ‘ఫేర్వేల్ ‘ పార్టీ అరేజ్ చేసేశారు. దానికి మా సార్లాంధరిని పిలిచారు. ఆ ఫేర్వేల్ పార్టీలో పదవతరగతి విద్యార్థులు పాఠశాలలో తమ తమ అనుభవాలను, మధుర స్మృతులను, భవిష్యత్తులో, చదివే చదువులు,తమ తమ గోల్స్.. తమ జూనియర్సతో పంచుకున్నారు, చెప్పారు. ఇప్పుడు నా వంతు వచ్చింది, నేను మాట్లాడుతూ..’ మన ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ మరియు నాకు జూనియర్లైన 9వ తరగతి విద్యార్థులందరికీ నా హృదయ పూర్వక పరిష్కారం. మితృలారా, నేను చాలా నిరుపేద కుటుంబం నుండి వచ్చాను. మొదటగా నేను పాఠశాలలో పేరు నమొదు చేసుకొనడానికే నానా కష్టాలు పడ్డాను. తర్వాత నాకు ఈ పాఠశాలలో సీటు రావడమే నా అదృష్టం. ఎందుకంటే ఇంత మంచి ఉపాద్యాయులు, ఇంత మంచి చదువు, ఈ గురుకుల పాఠశాలలో తప్పా, బయట ప్రపంచంలో దొరకడం చాలా అరుదు. ఒక వేళ దొరికినా, వేలకు వేలు ఫీజులు కొడితే తప్పా. నాకు పెద్ద పెద్ద చదువులు చదవాలని ఉంది. కాని పేదరికం, పరిస్థితి ఎలావుంటుందో!?, ముందు ముందు అర్థమౌతుంది. కావున కాబోయే 10 వ తరగతి విద్యార్థులు ఈ పాఠశాలను, ఇందులోని వసతులను ఉపయేగించుకోని, పదవతరగతి బాగా చదవాలని, తద్వారా తల్లి-దండ్రుల పేరు, ఉపాద్యాయుల పేరు, ఈ పాఠశాల పేరు నిలబెడతరని ఆశిస్తూ… ముగిస్తున్నాను’.
తర్వాత మా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, అనేక జాగ్రత్తలు చెప్పారు. సమాజానికి దూరంలో ఉన్నా, అడవి ప్రాంతంలో ఉన్న మాన పాఠశాలకూ మరియు బయట ఉన్నా పాఠశాలలకు, విద్యాసంస్థలకు ఉన్న తేడాను వివరించారు. బయట సమాజం ఎలావుంటుందో ! మనము ఎలామెదులుకోవాలో వాటిని పూస గుచ్చినట్లు వివరించాడు, ‘ ఉప్పలయ్య’ తెలుగు సార్. ‘హిందీ ‘ సుదర్శన్ సార్ ఒక తత్వవేత్త. అయన చాలా విషయాలు చెప్పాడు. ఆవిధంగా మా ఉపాధ్యాయులందరు మాట్లాడారు. ఆ తర్వాత మేము, మా ఉపాధ్యాయులు మరియు 9వ తరగతి విద్యార్థులు, అందరం కలిసి భోజనం చేశాము. భోజనం చేసిన తర్వాత మేమందరం, మా ఉపాధ్యాయులను పట్టుకోని ఏడ్చినాము. ఆ తర్వాత పడుకొనేందుకు క్లాస్ రూంకూ వెళ్ళి పోయాము. కాని ఆరాత్రి నిద్రపట్టలేదు. తెల్లవారితే స్కూల్ వదిలి వెళ్ళి పోతాము. అదేదో అర్థం కాని, తెలియని వేదన నా మనసును తొలిచి వేసింది.
— డా.బోంద్యాలు బానోత్(భరత్)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
నా కథ-13 -(గురుకుల పాఠశాల) — డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>