అణిచివేత(కవిత)-జి. కుమార్ రాజా

ఇప్పుడు నేనొక అణచబడ్డ
నిప్పు కణికను
నన్ను వెలగనీయకుండ
ఆర్పడానికే
ఎప్పుడు నిరుత్సాహమనే
నీళ్లు జల్లుతున్నావు
నాకై నేను పైకిలేస్తున్న
నాకేం తెలియదనీ
బలవంతంగా తొక్కేస్తున్నావు
అయినా భరిస్తున్న
ఎందుకో తెలుసా
ఎప్పటికైనా నాలోని
ప్రతిభను గుర్తిస్తావని…
కానీ నేనంటే ఎప్పటికీ
అసహ్యమే కదూ
అంతేలే నీవు ఎదుగొచ్చిన
దారి మరిచిపోయినప్పుడు
నా బ్రతుకు పట్ల శ్రద్ధ పెట్టవలసిన
అవసరం ఏముందీ..!
అందుకనే నువ్వెంత
అణచాలని ప్రయత్నించిన
నా పట్టు విడవను పడిన
చోటనే నిలబడతాను
నీ ముందే మండుతూ ప్రకాశిస్తా
నా చుట్టూ ఉన్న వాళ్లను
ప్రకాశించేలా తయారు చేస్తా.
జి. కుమార్ రాజా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

Comments
అణిచివేత(కవిత)-జి. కుమార్ రాజా — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>