తట్టి లేపాల్సిందే(కవిత )– పాలేటి శ్రావణ్ కుమార్

ఎవరైనా ఒకసారి
తట్టిలేపండి
రోజురోజుకీ లోలోనే నిర్జీవం
అవుతున్న నిజాన్ని
నిజాన్ని లోలోనే నిర్జీవం
చేస్తున్న మనిషిని
మనిషిని లోలోనే నిర్జీవం
చేస్తున్న సమాజాన్ని
ఒకసారి తట్టిలేపండి
అబద్ధపు ముసుగును
సమాజం మీది నుండి
ఎవరైనా తీసివేయండి
ఎవరైనా తొలగించండి
అబద్ధపు రంగును నిజం
మీద రుద్దడం ఆపివేయండి
మనుషుల కలయికే సమాజం
అయ్యిందని ఎవరైనా గుర్తు చేయండి
మనుషులను తట్టి లేపి చెప్పండి
వారిని వారే గుంపులుగా
ఏర్పడి నిందించుకుంటున్నారని
ఒక్కరైనా వీరిని
తట్టిలేపండి
ఒక్కసారైనా వీరిని
తట్టండి……చలిస్తారేమో!
– పాలేటి శ్రావణ్ కుమార్,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
తట్టి లేపాల్సిందే(కవిత )– పాలేటి శ్రావణ్ కుమార్ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>