*రండి అడుగేద్దాం.* (కవిత)- డాక్టర్ బేపల. సతీష్ కుమార్

మనసున వెలిగే మమతల వెలుగు- బంధమే
మనిషి జీవితానికే ఆధారమై,
నాటి నుంచి నడుస్తూనే ఉంది.
ఇగో ల అడ్డుగోడల తొలగించి
మనమే కోరుకుంటే చాలు
బంధాలు తిరిగి పూచే పువ్వులవుతాయి,
ఒక పలకరింపు నవ్వు చాలు.
పగలు రాత్రి నడిచే
తీరిక లేని జీవనంలో
అందరినీ కలిపిఉంచే
అంతస్సూత్రం ఆ నవ్వే..
గృహం గుండె అయితే
బంధువులు ఆ గుండెలోని ధమనులే,
అవి బలంగా ఉంటే
మన జీవితం సమతులంగా సాగుతుందిలే.
సంక్షోభం వచ్చినా, సంతోషం వచ్చినా
ఆనందంతో చేతులు కలపాలి,
చిన్న గొడవలను చిరునవ్వుతో
మన్నించి ముందుకు సాగాలి.
ప్రేమ పునాది వేసి
మనుషుల మనసులను కలపాలి,
రా… మనం కలిసి
కుటుంబ బంధాలు మళ్లీ వెలిగిద్దాం,
పగ, ప్రతీకారాలు కరిగించేసి
మనసుల మధ్య ప్రేమ పూయిద్దాం.
కుటుంబం అనేది చెట్టు…
మనమే ఆ చెట్టు కొమ్మకు
పువ్వులమై పూద్దాం.
– డాక్టర్ బేపల. సతీష్ కుమార్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nice