స్వేచ్ఛ (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు

ఆమె మరణించింది
ఆమె చేయని యుద్ధం
లేదు ఇంటా బయటా
లేదు ఇంటా బయటా
పోరు తప్పలేదు
తనతో తాను
అతనితో తాను
మనసు లేని మనుషుల్లో
ప్రేమను వెతుక్కుంది
ప్రేమను వెతుక్కుంది
దారిలో తారసపడ్డ వారిని
నమ్మింది కల్మషమెరుగని ఆమె
నమ్మింది కల్మషమెరుగని ఆమె
ప్రేమ వెనుకనున్న కాంక్షను
పసిగట్టలేని హార్మోన్ల ఉరుకులు పరుగులు
పసిగట్టలేని హార్మోన్ల ఉరుకులు పరుగులు
పెళ్ళి మంత్రానికి తనువు అర్పించింది
పెళ్ళి తంతు దాటవేత లో
అతడెప్పుడూ కృతకృత్యుడే
అతడెప్పుడూ కృతకృత్యుడే
పురుషాధిక్య సమాజం లో
మేనుల కలయికయే ప్రేమ పరాకాష్ట గా తిష్ట
ఎందు వెతుకులాడినా అంతిమం అదే
ప్రపంచీకరణ తో ప్రబలి మనిషిని
చిదిమి కరాళ నృత్యం చేస్తుంది సంఘం
చిదిమి కరాళ నృత్యం చేస్తుంది సంఘం
సహజీవన ప్రక్రియ లో
రెండు హృదయాలు పలవరిస్తే
రెండు హృదయాలు పలవరిస్తే
మానవ వికాసం
రెండు దేహాలు మాత్రమే పెనవేసుకుంటే
తిరోగమన మానవ సంస్కృతి
తిరోగమన మానవ సంస్కృతి
మరణం పిమ్మట నిరసించే గొంతులు
తన దాకా వస్తే పంచుకోలేవు
అంతర్ఘర్షణల యుద్ధంలో తనతో తానే
కత్తులు దూసుకుంటూ తనను తానే కోల్పోతాయి
కత్తులు దూసుకుంటూ తనను తానే కోల్పోతాయి
మనిషి మనిషి మాట్లాడుకోవటం మానేసారు
పక్కింటికి పక్కన హోటల్ కి వెళ్ళాలన్నా
గూగుల్ ని అడిగే తరంలో సంబంధాలు ఈడేరవు
గూగుల్ ని అడిగే తరంలో సంబంధాలు ఈడేరవు
నమ్మబలికే నరులకు ఆమె
ఓ బలిపీఠమెక్కిన జంతువు
ఓ బలిపీఠమెక్కిన జంతువు
ప్రతికూల సానుకూల
స్వేచ్ఛల నడుమ తేల్చుకోలేక
స్వేచ్ఛల నడుమ తేల్చుకోలేక
దొర్లిన కాలంలో కోల్పోయిన
దాన్ని అంచనా లో
దాన్ని అంచనా లో
పరువు పదం చెవుల్లో
గింగిరాలు తిరుగుతుంటే
గింగిరాలు తిరుగుతుంటే
తన దేహాన్ని బలవన్మరణం
దిశగా మలుస్తుంది
దిశగా మలుస్తుంది
ఆమె చివరి పయనం
చితిగా మార్చుకుంది
చితిగా మార్చుకుంది
సిగ్గు లేని సమాజం
తన దైనందిన జీవితంలో యథావిధిగా!
తన దైనందిన జీవితంలో యథావిధిగా!
తన చుట్టూ ఉన్న
ప్రపంచాన్ని చూసీ చూడనట్లు!!
ప్రపంచాన్ని చూసీ చూడనట్లు!!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
స్వేచ్ఛ (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>