నాంపల్లి సుజాత అన్నవరం
నాంపల్లి సుజాత అన్నవరం
నా తల్లిదండ్రులు శ్రీమతి కేదారమ్మ,కీ.శే.అన్నవరం దశరథం ఉపాధ్యాయులు.
సహచరులు ..శ్రీ నాంపల్లి రాములు
జన్మస్థలం పోతారం(S), మండలం హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట
వృత్తి.. ప్రభుత్వ ఉపాధ్యాయుని
నివాసము.. హైదరాబాద్.
ప్రచురించిన పుస్తకాలు:
1) నెమలీకలు –2006
2) మట్టి నా ఆలాపన –2009
3) మట్టి నానీలు –2015
4) జొన్నకంకి –2020
5) హోమ్ మేకర్–2023
6)’కుదురు ‘ సాహితీ వ్యాసాలు -2024
పురస్కారాలు:
—- సీనియర్ సిటిజన్స్,లైన్స్ క్లబ్,ప్రేరణా వారి
ఉత్తమఉపాధ్యాయకవి అవార్డు –2018
—- కొండూరు రాఘవరావు,రాజ్యలక్ష్మమ్మ చారిటబుల్
ట్రస్ట్ వారి మొల్ల అవార్డు –2017
— పాత రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వారి ఉత్తమ ఉపాధ్యాయినీ
పురస్కారం –2018
— కవయిత్రి మొల్ల కళావేదిక,తాండూరు వారి మొల్ల
సాహిత్య పురస్కారం–2022
—- లలిత కళాభిరామ పించము వారి ఉత్తమ కవయిత్రి
పురస్కారం–2022
—– శాలివాహన జాతీయ విశిష్టవనితా పురస్కారం– 2023
—– సైమన్ ఫౌండేషన్ పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ జాతీయ
కవితా పురస్కారం–2023
నా సబ్జెక్టు సాంఘిక శాస్త్రం కాబట్టి నేను హక్కులు బాధ్యతలు స్వేచ్ఛా సమానత్వాల గురించి మా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు చెపుతుంటాను. -మహిళల వెనుకబాటుకు కారణాలు సాధికారత చదువు శాస్త్రీయ అవగాహన లేకపోవడమే నని విద్యార్థులకు తెలియజేస్తూ ఉంటాను.
– విద్యార్థులకు కవిత్వం,కథలూ రాయడంలో మెలకువలను నేర్పుతూ ఉంటా
-ఎందరో విద్యార్థులను కవులుగా తీర్చిదిద్ది ప్రోత్సహించాను.
నాకు నచ్చిన కవిత్వం:
-అభ్యుదయ కవిత్వం ముఖ్యంగా శ్రీశ్రీ ‘అలిశెట్టి ప్రభాకర్ , డా.గోపి గార్లవి,
-నచ్చనివి మూడ నమ్మకాలు, మహిళలను చిన్న చూపు చూడడం, లింగ వివక్ష మొదలైనవి
-కోరుకునేది ప్రతివాళ్ళు అజ్ఞానాన్ని తొలగించుకొని మానవత్వాన్ని పెంచుకుని నలుగురికి
మార్గదర్శకులుగా ఉండాలనీ..కోరుకుంటా..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
నాంపల్లి సుజాత అన్నవరం — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>