“తులనాత్మక పరిశోధన పద్ధతులు” అంతర్జాల జాతీయ కార్యశాల
పి.ఆర్.ఆర్ & వి.ఎస్. ప్రభుత్వ కళాశాల, విడవలూరు,శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మరియు డి.కె.డబ్ల్యూ ప్రభుత్వ మహిళా కళాశాల(స్వ.) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తెలుగు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో “తులనాత్మక పరిశోధన పద్ధతులు” అనే రెండురోజుల అంతర్జాల జాతీయ కార్యశాలను 13&14 ఏప్రిల్ 2025 నిర్వహించారు. అందులో భాగంగా మొదటి రోజున ఆచార్య మలయవాసినిగారు ‘సాహిత్య ప్రక్రియలు తులనాత్మక పరిశోధన’ అంశం మీద, ఆచార్య అయినవోలు ఉషాదేవిగారు ‘వ్యాకరణం తులనాత్మక పరిశోధన’ అంశం మీద, డా. లక్ష్మణచక్రవర్తిగారు సాహిత్య విమర్శ తులనాత్మక పరిశోధన’అనే అంశం మీద ప్రసంగించారు. రెండవ రోజు కార్యశాలలో గౌరవ అతిథిగా ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు, సంచాలకులు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పాల్గొన్నారు. తర్వాత ఆచార్య జె.వి. సత్యవాణిగారు ‘తెలుగు సాహిత్యం-తులనాత్మక పరిశోధన’ అనే అంశం మీద, ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు ‘తులనాత్మక పరిశోధన-ఆవశ్యకత’ మీద, డా.డి.చంద్రశేఖర్ రెడ్డి ‘భాషాశాస్త్రం-తులనాత్మక పరిశోధన’ అంశం మీద, ఆచార్య పగడాల చంద్రశేఖర్ గారు ‘జానపద సాహిత్యం-తులనాత్మక పరిశోధన’ అంశం మీద ఉపన్యసించారు. రెండు రోజుల కార్యశాలలో పరిశోధకులు వెలుబుచ్చిన అనుమానాలను నివృత్తి చేయటం జరిగినది. ఈ కార్యక్రమాన్ని డా. జి. పద్మప్రియ, తెలుగు అధ్యాపకులు పి. ఆర్. ఆర్.& వి.ఎస్.కళాశాల,విడవలూరు మరియు డా. కె. కరుణశ్రీ, తెలుగు అధ్యాపకులు,డి.కె.డబ్ల్యూ కళాశాల నెల్లూరు వారు సమన్వయ కర్తలుగా ఉన్నారు.
ఈ కార్యశాల ప్రసంగాలు ఆసక్తి ఉన్నవారు ఈ కింది లింకు లో చూడగలరు.
https://www.youtube.com/live/AxoH_A5Q7U0?si=eCojmef9OMJBjadQ
-విహంగ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
“తులనాత్మక పరిశోధన పద్ధతులు” అంతర్జాల జాతీయ కార్యశాల — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>