“ప్రబంధ వాఙ్మయము – సాహిత్యనుశీలనం జాతీయ సదస్సు “
ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ & పిజి కళాశాల(A), మహబూబ్ నగర్,తెలంగాణ, RUSA వారి ఆర్థిక సౌజన్యంతో”ప్రబంధ వాఙ్మయము-సాహిత్యనుశీలనం”అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సును 17 ఏప్రిల్ 2025 నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అతిధులుగా హాజరైన పెద్దలు మాట్లాడుతూ ఎక్కువ మంది ఆంగ్ల మాధ్యమంపైనే దృష్టి పెడుతున్నారని, తెలుగును మరచిపోతున్నారని ఆవేదనను వ్యక్తంచేశారు. తెలుగును కాపాడుకోవాలని కోరారు. తెలుగు ద్వారానే మన సంస్కృతీ సంప్రదాయాలు, పండగలు వాటి విశిష్టతలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. తెలుగు కవుల రచనలను ప్రోత్సహించాలన్నారు. ఈ ప్రబంధ వాజ్మయం 16 వ శతాబ్ధం కాలం నాటి ప్రజల సమాజ స్థితిగతులు,ఆర్థిక పరిస్థితులు, వారి ఆహారపు అలవాట్లు, సాంప్రదాయాలు, ఆచారాలు తెలుసుకునే అవకాశం ఉంది. ప్రబంధాలలో ఉన్న హాస్యము, చతురత, వర్ణన, శృంగారం, కథ, అనేక అంశాల ద్వారా అనేది ఉత్తమమైన జీవన పద్ధతిని ఏ విధంగా అనుసరించవచ్చో తెలుస్తుందని అన్నారు.ఈ సదస్సులో అన్ని ప్రబంధాల మీద పరిశోధన పత్రాలను సాహితీవేత్తలు, పరిశోధకులు సమర్పించారు. ఈ వ్యాసాలను ఒక సావనీర్ గా వేలువరించారు.ఈ కార్యక్రమనికి కళాశాల తెలుగు విభాగాధిపతి డా. ఎన్. లక్ష్మీనరసింహారావు సమన్వయకర్తగా ఉన్నారు.
ఈ సదస్సులో డా. ఆర్.శ్రీనివాసరావు తెలుగు అధ్యాపకులు, మారీస్ స్టెల్లా కాలేజీ, విజయవాడ, వారు “అయ్యలరాజు రామభద్రుడు ‘ రామాభ్యుదయం’ రసపోషణము” అనే పరిశోధన పత్రాన్ని ఆన్లైన్ లో సమర్పించటం జరిగింది.
-విహంగ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
“ప్రబంధ వాఙ్మయము – సాహిత్యనుశీలనం జాతీయ సదస్సు “ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>