అలుపెరుగని అనిశెట్టి రజిత (సంపాదకీయం) – మానస ఎండ్లూరి

నేనిప్పుడు నా మనోదేహాల బూజుల్ని
దులపరించుకొని మనిషిని కావాలి
కవినై గాయకినై శిల్పినై కొత్తగా
నవజాత శిశువులా ఆవిష్కృతం కావాలి..
– అనిశెట్టి రజిత
రజిత రచయిత్రిగా, తెలంగాణ ఉద్యమ గళంగా పరిచయం అక్కరలేని పేరు. కవిగా ప్రజా గాయనిగా బహుజన సమాజ అభివృద్ధి కోసం పరితపించిన వనిత. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వ్యవస్థాపక సభ్యురాలిగా 2009 నుంచి ప్రరవేలో భాగంగా ఉన్నారు. వరంగల్ లో ఆమె కలిసి పనిచేయని ప్రజా సంఘం లేదు. రుద్రమ ప్రచురణలు ప్రారంభించి స్త్రీల సాహిత్యంకి పెద్ద పీట వేశారు. వరంగల్ లో ఉన్న రచయిత్రులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఎక్కడ సభ జరిగినా అనారోగ్యాన్ని కూడా లెక్కజేయకుండా తన కార్యాలను పూర్తిగా నిర్వర్తించేవారు రజిత.
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్వహించిన సంస్మరణ సభలో తెలంగాణ అధ్యక్షురాలు తిరునగరి దేవకీ దేవి రజిత తన పడకుండవ ఏటలోనే ఉద్యమాల్లో తను పెట్టిన మొదటి అడుగు నుంచి ఆమె జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
పోయిన ఏడాది రజిత తన కళ్ళను, శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేసింది. ఆమె అనుకున్నట్టే ఆ పనులు, ఆమె మిత్రులు, సంఘాల వారిచే సవ్యంగా జరిగాయి.
తన నిష్క్రమణ ఊహించనిది అయినా, దుఃఖభరితమే అయినా ఆమె జీవితం ఎప్పటికీ ఒక స్పూర్తి. కొత్త తరాలు తెలుసుకోవాల్సిన వ్యక్తి ఆమె.
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు
రచయిత, ప్రజా గాయని, అవయవ దాత అనిశెట్టి రజిత ఆశయాలను ముందుకు నడిపిద్దాం…
-మానస ఎండ్లూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
అలుపెరుగని అనిశెట్టి రజిత (సంపాదకీయం) – మానస ఎండ్లూరి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>