సామాజిక దిక్చూచి (కవిత)-కె. సౌందర్యవతి
అంబేద్కర్ అంటేనే ఒక లెజండ్
సాహసోపేతమైన నిర్ణయానికి
నిలువెత్తు రూపం అంబేద్కర్
ఎదురు తిరగడమనేది
అసాధ్యంగా ఉన్న రోజుల్లో
పేద ప్రజలకు అండగా నిలిచిన
ఆజానుబాహుడు
మన డా. బి. ఆర్ అంబేద్కర్
భారతీయ న్యాయ ఆర్థికవేత్తగా
ఖ్యాతికెక్కిన ఆయన కీర్తి అజరామరం
బడుగు బలహీన వర్గాలవారికి
వారధిగా నిలిచిన మీ ధైర్యం
ప్రతి యువతకు ఆదర్శం
పేదవారి సమానత్వం కోసం
ఎలుగెత్తిన ధీరుడు
మన అంబేద్కర్
పేదరికంతో కులమత ద్వేషాలతో
తల్లడిల్లుతున్న ప్రజల జీవితాల్లో
రాజ్యాంగ నిర్మాతవై
ప్రపంచ దేశాలు మెచ్చిన
మహోన్నతుడై
పాలనా దక్షత రాజనీతిజ్ఞత
తెలిపిన బహుభాషావేత్తగా
ప్రజలందరి గుండెల్లో
పదిలమైన మీ రూపం
సామాజిక దిక్చూచి
జయహో
డా బి ఆర్ అంబేద్కర్
-కె. సౌందర్యవతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
సామాజిక దిక్చూచి (కవిత)-కె. సౌందర్యవతి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>