నా స్వరం(కవిత )- వాసవి

ప్రపంచానికే వినిపించేలా
ఉన్నటువంటి నా స్వరం
ఎదురు నిలబడేనా
పోరాడాలన్నదే నాగమ్యం
నాలుగు గోడల మధ్య
అంతమయ్యేలా చేస్తుంది ఈ కాలం
జీవితాన్ని వరంగా భావించి
ముందుకు నడవాలన్నదే నా లక్ష్యం
ప్రతి ఆడపిల్లలో వెలుగు
నింపాలని నా తాపత్రయం
ఎప్పటికీ మరువను
నా ఈ చిన్ని ప్రయత్నం
ఊపిరి ఆగిపోయేదాకా చేస్తాను
నా పోరాటం
ప్రతి ఆడపిల్లని చేస్తాను
నేటి తరానికి ఒక ఆయుధం
కష్టమొచ్చిన కన్నీళ్లు వచ్చినా
రేపటి గెలుపే అన్నింటికి
నా యొక్క సమాధానం
– సిహెచ్.వాసవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
నా స్వరం(కవిత )- వాసవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>