సమస్యలెక్కడుంటే తానక్కడ వారికి బాసటగా రాజితక్క (స్మృతి వ్యాసం) A. విద్యా దేవి.
రజితక్క అంటే వరంగల్. వరంగల్ అంటేనే రజితగా సాహితీ ప్రపంచంలో తనకంటూ పేరు సంపాదించుకున్నది. ఈ సమాజంలో సమస్యలెక్కడుంటే తానక్కడ వారికి బాసటగా నిలిచి పోరాడింది. తన కలంతో,గళంతో ఒక ధిక్కార స్వరాన్ని వినిపించింది. వరంగల్ కవయిత్రులలో తనకొక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నది. స్త్రీల సమస్యల పట్ల వెంటనే స్పందిస్తూ బాధితులకు తగిన న్యాయం చేయాలని ఆరాటపడేది. పేద బడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషిచేసింది. పీడితుల పట్ల తన సానుభూతిని చూపడంతోపాటు, నలుగురినీ తనవెంట తీసుకపోయి మీకు మేమున్నామనే ధైర్యాన్ని అందించింది. ప్రజల కోసమే జీవిస్తూ ప్రజాస్వామిక వాదిగా మారింది. అనేక ఉద్యమాలలో పాల్గొన్నది. తను మాత్రమే సభలు, సమావేశాలు, ఉద్యమాలలో పాల్గొన్నకుండా నాలాంటి ఎందరినో కూడగట్టుకొని పోయేది. అలా రజితక్క “ఒక వ్యక్తి కాదు శక్తి”గా నిలిచి ఎందరికో మార్గదర్శకురాలైంది.
మనకు పరిచయమైన వారందరూ మనకు దగ్గర కారు. చాల కొద్దిమంది మాత్రమే ఆత్మీయులౌతారు. నేను నాకెంతో ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తి చేస్తున్న క్రమంలో ఉద్యోగం, పిల్లలు, భర్త, కూతురు, బంధుమిత్రులు ఇదే నా ప్రపంచంగా ఉండేది. . కాగా తెలుగు సాహిత్యంపై అభిమానంతో ప్రైవేటుగా యం.ఎ.తెలుగు, దూరవిద్య ద్వార ఎం.ఫిల్., పిహెచ్.డి. చేసాను.
కుటుంబ పరిస్థితుల దృష్ట్యా బి.కాం. సాయంకళాశాలలో చేస్తూ, ఉదయంపూట ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా చేరిన క్రమంలో శ్రీరంగస్వామి అన్నయ్య పిల్లలు అదే బడిలో చదువుతుండటంతో అన్నయ్యతో పరిచయమైంది. అన్నయ్య నిర్వహిస్తున్న శ్రీలేఖ సాహితీ సంస్థ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేయడం, ఆ సంస్థ ప్రచురించే పుస్తకాలలో రచనలు చేయడం, సభలలో పాల్గొనడం,ఆ సందర్భంలోనే కవి, రచయిత్రి, విమర్శకురాలు, మహిళాభ్యుదయవాది, ప్రజాస్వామ్యవాది, సామాజిక కార్యకర్త ఐన రజితక్కతో పరిచయం కలిగింది.
– A. విద్యా దేవి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
సమస్యలెక్కడుంటే తానక్కడ వారికి బాసటగా రాజితక్క (స్మృతి వ్యాసం) A. విద్యా దేవి. — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>