మా దీపలతవి నువ్వే (కవిత)- వెంకట్ కట్టూరి

అక్షోట వృక్షోధ్యాన వనంలో
కర్పూర పూగుత్తివి నువ్వు
‘నల్లద్రాక్ష పందిరి’ నీడలో
‘నిత్య గాయాల నెలవంక’వి నువ్వు
ప్రకృతి సోయగాల పరిమళాలకు
ప్రతిరూపం నువ్వు
సమాజ సామాజిక నిర్మాణానికి
వెన్నుదన్ను నువ్వు
ఆదిమ ‘అవ్వ’ నుండీ
మా దీపలతవి నువ్వే
ఆటుపోట్ల గుండె కోతలకు
గురయ్యే జలతారు
మేఘానివి నువ్వు
విశ్వ జనీన సాహిత్యానికి
విశ్వప్రేమకు,విశ్వసనీయతకు
వెలుగువు నువ్వు
శ్రమైకజీవన సౌందర్యానికి
‘వేకువరాగం’ నువ్వు
వివిధ వ్యధల సమ్మిళిత
‘మిళింద’ వి నువ్వు
అన్నిటికీ మించి అమ్మవి నువ్వు
ఇవాళే నువు అంతర్జాతీయమయ్యావు
‘విహంగ’మై పతంగంలా సాగిపో
అన్నింటా అనంతంలా
( మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా)
-వెంకటేశ్వరరావు కట్టూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
మా దీపలతవి నువ్వే (కవిత)- వెంకట్ కట్టూరి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>