అరణ్యం 2 కొత్త శీర్షిక ప్రారంభం మీ కోసం
అందరికీ నమస్కారం. విహంగ మహిళా అంతర్జాల సాహిత్య మాస పత్రికలో అరణ్యం పేరుతో సంవత్సరకాలం పాటు వచ్చిన వ్యాసాలు 2022 సంవత్సరంలో ధరణీరుహ పేరుతో పుస్తకంగా వచ్చింది. అది నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. చాలామంది అందులో ఉన్న అంశాలు గతంలో ఎక్కడా ప్రస్తావించనివని పుస్తకాన్ని ఆసాంతం ఆస్వాదించామని తెలియజేశారు. సాహిత్యంలో పేరెన్నికగన్న ప్రఖ్యాత రచయితలు తమ హృద్యమైన స్పందనను తెలియజేశారు. మరిన్ని ప్రాకృతిక పర్యావరణ వ్యాసాలు రావలసినటువంటి అవసరం ఉందని అన్నారు. ఇది నన్ను ఎంతగానో ఉత్సాహపరిచిన సందర్భం. అడవి కథ ఒకదానితో ఆగిపోయేది కాదు, ఒక విషయానికి పరిమితమైంది కాదు. అది అనంతం. ఆ అనంతంతో ఎంతో కొంత సంబంధం కలిగి ఉండడం నాకున్న భాగ్యం. దాన్ని చెప్పాలన్న కుతూహలమే అరణ్యం రాయడానికి కారణం. ఇప్పుడు అదే అరణ్యంలో ప్రయాణం , అరణ్యం
రెండవ భాగంగా వెలువడనుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ ఫిబ్రవరి నుంచి మన విహంగలో ప్రతినెలా రాబోతున్నది. మొదటి భాగం లాగానే ఈ భాగమూ మీ అందరి మన్ననలను పొందుతుందని ఆశిస్తాను.
-దేవనపల్లి వీణావాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
అరణ్యం 2 కొత్త శీర్షిక ప్రారంభం మీ కోసం — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>