నా కథ-15 (ఇంటర్మీడియట్)— డా.బోంద్యాలు బానోత్(భరత్)

రెండు సంవత్సరాలు (1994-1996) ‘ఆర్ ఐటీఐ’ పూర్తి చేసాను. కాని నాకెందుకో ఆ రెండు సంవత్సరాలు చదివినట్టు అనిపించలేదు. ఐటీఐ అర్హతతో జాబుల నోటీఫీకేషన్ వస్తే అప్లై చేసుకోంటూ ‘ఇంటర్మీడియట్’ చదవాలని నిర్ణయించుకున్నాను. తొర్రూరు దగ్గిరౌతుందని , తొర్రూరులోని ‘మహాత్మా జూనియర్ కళాశాల’ లో చేరాను. ఎంపీసీ కోర్సు తీసుకున్నాను. రోజు ఇంటీ నుండి కాలేజీకీ పోవడం కష్టమయ్యింది. తండా నుండి ఊరి బస్టాండ్ కూ రెండుంన్నర- మూడు కి.మీ. దూరం ఉంది. రోజు 2 నుంచి 3 కీ.మీ. నడిచీ పోయినా, సమయానికి బస్ దొరకక పోయేది. కాబట్టీ కాలేజీకీ ఒక కి.మీ. దూరంలో, తొర్రూరు బస్ డీపోకూ ఎదురుగా, ఒక ఫర్లాంగు దూరంలో, గొల్లోల్ల ఇంట్లో రూమ్ తీసుకుని ఉన్నాను. ఆ రూంలో నల్గురం కలిసి ఉండేవాళ్ళం.
రోజు కాలేజీకీ వెళ్ళేవాడిని. మ్యాథ్స్ లో త్రికోణమితి చాప్టర్ లెక్కలు చెబుతున్నాడు, లెక్కల సార్. కొన్ని చెప్పీ, మిగతావి చేసుకుని రావాలని హోం వర్క్ ఇచ్చేవాడు. నేను కొన్ని చెయ్యగలుగుతున్నాను, కొన్ని సగానికి చేసి వదిలేస్తున్నాను. ఏదైనా లెక్కా సగంవరకు చేసేవరకు మెడనొప్పి మొదలైయేది. ఈ మెడనొప్పి ‘ఆర్ఐటీఐ’ లో నే మొదలయింది. కాకపొతే అంతగా ఉండేది కాదు. డాక్టర్లకు చూపించిన, ఏమిలేదని, వారానికి మందులు రాసి, పంపేవాళ్ళు.
అలా వర్షాకాలం గడించి పోయింది. దసరా తర్వాత , ముగ్గురు యువకులు, బక్క-పలుచగా ఉన్నారు. సంకన సంకసంచి వేసుకొని మా కాలేజీకీ వచ్చారు. అందులో ఒక్కాయన ముందుగా, పాట పాడాడు. తర్వాత ‘పీ.నాగేశ్వరరావు’ అనే అతను ‘ప్రభుత్వ విద్యావిధానం’ పై ఉపన్యాసం ఇచ్చాడు. అదే విధంగా తమ విద్యార్థీ సంఘం, ఆ సంఘం చేస్తున్నా పోరాటాలు, ‘ఎస్ ఎఫ్ ఐ’ ఆశయాలు.. స్వాతంత్ర్యం! ప్రజాస్వామ్యం!! సోషలిజం!!!.. అనే ఆశయాలను సాధించడం కోసం నిరంతరం పని చేస్తుంన్నాము’. చివరగా ఎవరికైనా డౌటుంటే ! ప్రశ్నలు అడగవచ్చు అని అన్నాడు. నేను విద్యా ప్రైవేటీకరణ మీద ప్రశ్నలు అడిగాను. దానికి ఆయన చెప్పిన సమాధానాలు సరియయినవే అనిపించింది. ‘స్వాతంత్ర్యం! ప్రజాస్వామ్యం!! సోషలిజం!!!’ పైన కూడా ప్రశ్నలు అడిగాను. ఐతే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుతూ.. ‘ఈ ప్రశ్నలకు తక్కువ సమయంలో లేదా ఒక వాక్యం లో ఇచ్చే సమాధానం, సంతృప్తీ పరచక పోవచ్చు. వీటిని అర్థం చేయించుటకూ లేదా ఒక వ్యక్తి వాటిని అర్థం చేసుకొనుటకు, ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మేము అతి త్వరలో ‘ఎస్ ఎఫ్ ఐ’ ఆధ్వర్యంలో, ఈ తొర్రూరు కేంద్రంగా, రెండు రోజులపాటు విద్యవైగ్ననిక తరగతులు నిర్వహిస్తన్నాము. ఆసక్తి ఉన్నవారు ఆ తరగతులకు వచ్చీ, వినీ .. అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొన వచ్చూ.’ అని చెప్పీ , వాళ్ళు పోతూ పోతూ.. నా పేరూ, ఊరూ, ఉండే చోటు..అన్నీ అడిగి తెలుసుకున్నారు.’ మేము మళ్ళీ కలుస్తాము.’ అని చేప్పీ వేళ్ళి పోయారు. ఆవిధంగా వారితో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత రోజు నుండీ యధావిధిగా కాలేజికి వెళ్ళుతున్నాను. ఒక వారం రోజుల తర్వాత, మళ్ళీ ఇద్దరు యువకులు, ‘ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ మొదటి సంవత్సరం చదివే వాళ్ళ వయస్సు కలిగి ఉంటారు. అంటే ,17-20 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటారు. వాళ్ళు మళ్ళీ మా కాలేజీకీ, కాలేజీ వదిలే సమయానికి, వచ్చారు. నేను కాలేజీ నుండి బయటకి వెళ్ళుతున్నా సమయంలో, రోడ్డు మీద కలిసి.. ‘ హలో బొంద్యాలన్నా నమస్తే..’ అనుకుంటూ నాతో నడిచి తొర్రూరు బస్ డీపోకూ ఎదురుగా, మేముంటున్న రూమ్ కూ వచ్చారు. మా రూమ్ కు వచ్చారని, చాలా సేపు మాట్లాడాము. మాట్లాడుకుంటూనే, స్టౌ పై బియ్యం పెట్టాను, అన్నం అవుతుండగానే, టమాటా, పచ్చి మిర్చి కోసి , కోడి గుడ్ల కూర వండాను. వాళ్ళకూ పెట్టీ, నేను వేసుకున్నాను. అంధరం భోజనం చేశాము. బొంద్యాలన్నా ‘కోడి గుడ్ల కూర’ అదిరింది. చాల బాగుంది. థ్యాంక్యూ అన్నా!. “ఇక మేము వెళ్ళుతం బొంద్యాలన్నా !, ఇప్పటికే చాలా లేటయ్యింది.ఇగో నా పేరు:’స్కైలాబ్ బాబు’, ఇతని పేరు: ‘బోడ లక్ష్మణ్’, ఇతను మీ భీయ్యాగాడే’, మేము మళ్ళీ కలుస్తాము.” అంటూ రాత్రి 7:30 సమయంలో వాళ్ళు, వెళ్ళీ పోయ్యారు.
తెల్లారి నుండి నేను ఎధావిధిగా కాలేజీ కీ వెళ్ళుతున్నాను. జనవరి నెల మొదలైంది. చలి విపరీతంగా పెడుతుంది. కాలేజీలో మా కెమిస్ట్రీ సార్ జోయెల్ గా ఉండే వాడు. ఫీజిక్స సార్ బక్కగా, కోల ముఖం, సీరియస్ గానే ఉండే వాడు. మెడనొప్పి కారణంగా, మ్యాథ్స్ సబ్జెక్టును వదిలీ, బయోలోజీ సబ్జెక్టు కూ మారాను. బయోలోజీ సబ్జెక్టు సారు కూడా నవ్విస్తూ పాటాలు చెప్పేవాడు. ఇంగ్లీష్ సార్ నెమ్మదిగా పాటాలు చెప్పేవాడు. తెలుగు సార్, గవర్నమెంట్ రిటైర్ టీచరు.
మల్లీ ఒక వారం తర్వాత, ‘బోడ లక్ష్మణ్’, మహబూబాబా డివిజన్ ‘ఎస్ ఎఫ్ ఐ’ విద్యార్థి సంఘం నాయకుడు, తన ఫ్రెండ్ ‘జిలుకర శ్రీనివాస్’ ను వెంట పెట్టుకునీ నా రూమ్ కూ వచ్చాడు. ఈ సారి కూడా ‘టమాటా కోడిగుడ్లు’ కూర వండాను. ఆ కూరతో ముగ్గురం అన్నం తిన్నాము. తర్వాత ‘బోడ లక్ష్మన్’ , జిలుకర శ్రీ నివాస్ ను పరిచయం చేస్తూ,”ఇగో ఈ తమ్ముడి పేరు: ‘జిలుకర శ్రీ నివాస్ ‘, తొర్రూరు మండల ‘ఎస్ ఎఫ్ ఐ’ బాధ్యుడు. ఇక నుండి నీకు అందుబాటులో ఉంటాడు. మీ కాలేజీలో, ఏ వైన సమస్యలుంటే ఈయనతో చెప్పవచ్చు. ముఖ్యమయిన విషయం ఏమిటంటే! త్వరలో , ఈ తొర్రూరు కేంద్రంలో రెండు రోజులపాటు విద్యా వైజ్ఞానిక తరగతులు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాము. ఆ విద్యా వైజ్ఞానిక తరగతులలో పాఠాలు బోదించుటకూ, పెద్ద పెద్ద సార్లు వస్తారు. చాలా మంచి మంచి విషయాలు చెపుతారు. విద్యార్థి ఉద్యమాల చరిత్ర, భారత దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్ర, ఎకనామిక్స్, సివిక్స.. మొదలగు అనేక విషయాలు బోదిస్తారు. మీ కాలేజి నుండి నీతో పాటు, అధిక సంఖ్యలో హజరైయ్యేలా చూడాలి. మిగతా కాలేజిల నుండి కూడా విద్యార్థులు అధిక సంఖ్యలో హజరైయ్యేలా చూడాలి. మొత్తానికి ఈ విద్యా వైజ్ఞానిక తరగతులను, విజయవంతం చేసే బాధ్యత మీ ఇద్దరి పైన ఉన్నది. సరే మరి, ఇప్పటికే చాలా లేటయ్యింది, మేము పొయివస్తం.” అని బోడ లక్ష్మణ్ మరియు జిలుకర శ్రీ నివాస్, ఇద్దరు మహబూబాబాద్ డివిజన్ ఆఫీస్ కూ వెళ్ళిపోయారు.
వాళ్ళు వస్తూ-పోతు ఉంటే, ఇప్పటిదాకా వాళ్ళనీ లైట్ తీసుకొన్నాను. కాని ఇప్పటి నుండీ వాళ్ళు చెప్పిన విషయాలపై కొంచం ఎక్కువ ఆలోచించడం మొదలు పెట్టాను. అప్పుడు 1996 సంవత్సరం నుండి 1997 వ సంవత్సరంలోకీ అడుగు పెట్టినం. నాకు అప్పుడప్పుడు మెడనొప్పి, తల నొప్పి వస్తుంది. చాలా మంది తలనొప్పికీ కళ్ళద్దాలు వాడుతుంటారు. నా తలనొప్పి కూడా కళ్ళద్దాలు వాడుతే పోతుందేమో! అని భావించి డాక్టర్ తో ‘ తలనొప్పికీ కళ్ళద్దాలు కావాలని రాయించి తీసుకున్నాను. నాకు వాటిగురించి సరిగ్గా తెలియకా పెద్దమనుషులు వాడే, పెద్దసైజు కళ్ళద్దాలు కొన్నాను. వాటిని పెట్టుకోని కాలేజీకీ వెళ్ళాను. కాలేజీలో అందరూ వింతగా చూషారు. నేను వాళ్ళను పట్టించుకోలేదు, ఎందుకంటే నా సమస్యా నాకు తెలుసు కాబట్టి.
ఐతే, ఆ రోజు వాళ్ళు అన్నట్లే , పది రోజుల తర్వాత ప్లాన్ ప్రకారం, తొర్రూరులో, మా కాలేజీకీ మరియు ప్రభుత్వ పాఠశాలకీ మధ్యలో ప్రధాన రహదారికి పక్కన, చెట్లకిందా, టెంటు వేసి, వంద మందికి, రెండు రోజులకూ సరిపడేలా, భోజనాలు, మంచినీళ్ళు.. సమకూర్చారు. అంతకు ముందు రెండు రోజులపాటు, తొర్రూరులోని అన్ని జూనియర్ కళాశాలలు తిరిగి, విద్యా వైజ్ఞానిక తరగతుల గురించి చెప్పాము. ఈ ప్రచారంలో నాకు ప్రాధాన్యత ఇచ్చారు. అంటే నేను లీడ్ చేస్తున్నట్టూ.. ప్రతి విషయంలో నన్ను మందు పెట్టారు. నాకు కూడా సంతోషమనిపించింది.
క్లాస్ లు మొదలయినయి. మొదటి రోజున వివిధ కాలేజీల నుండీ 70-80 మంది విద్యార్థులు హాజరయ్యారు. ‘ఎస్ ఎఫ్ ఐ’ వరంగల్ జిల్లా కార్యదర్శి ‘ఉప్పలయ్య’-‘సమాజపరిణామ క్రమం’ అనే అంశంపై క్లాస్ తీసుకున్నారు. ‘డీవైఎఫ్ఐ’ వరంగల్ జిల్లా- ‘రంగన్నా’- ‘భారత దేశంలో విద్యార్థీ ఉద్యమాలు-విద్యావిధానం’ అనే అంశంపై క్లాస్ చెప్పాడూ. ఇక, రెండవ రోజున ‘ఎకనామిక్స్- పొలిటికల్ ఎకానామీ’, సివిక్స, మొదలగు విషయాలను తీసుకోని బోదించారు.. ఆ విధంగా రెండు రోజుల విద్యా వైజ్ఞానిక తరగతులు విజయవంతంగా ముగిశాయి.
ఈ విద్యా వైజ్ఞానిక తరగతుల ప్రభావం నా పై పడింది. అప్పటినుండీ మహబూబాబాద్ డివిజన్ లో ఎస్ ఎఫ్ ఐ మరియు పార్టీకీ సంబందించిన ఏ కార్యక్రమం జరిగిన, నన్ను పాల్గొనాలని చెప్పేవారు. అలాగే చేసేవాడిని. దానితో కాలేజీకీ పోవడం తగ్గిందీ, మానుకోట ‘ఎస్ ఎఫ్ ఐ’ ఆఫీసుకూ ఫోవడం ఎక్కువయింది. ఒక సారి మానూకోట పార్టీ ఆఫీసుకూ పోతే, రెండు-మూడు రోజులు అటే ఉండిపోయే వాడిని. వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనా విధానము, వాళ్ళు అనుసరించి సిద్ధాంతము..నాకు బాగా నచ్చాయి. అప్పుడప్పుడు అక్కడే ఉండి పోయినప్పుడు, ఆ పార్టీ ఆఫీసులోనే పడుకొనే వాడిని. పడుకోవడానికి ఏమీ ఉండేవి కావు. పాత చినిగిన చాపా ఉండేది, అది ఎటూ సరిపోయేది కాదు. వార్తా దినపత్రికలను కింద పరుచుకొనే వాడిని. కప్పుకోవడానికి కూడా వార్తా దినపత్రికలను ఉపయేగించే వాడిని. డబ్బులు ఉంటే మార్నింగ్ టిఫిన్ చేయడం లేదంటే 10-11గంటల ప్రాంతంలో, లేదా మధ్యాహ్నం సమయానికి, పార్టీ ప్రజాసంఘాల లీడర్ ఇంట్లో తినబెట్టే వాళ్ళు. ఆ విధంగా అక్కడే ఉండి, పార్టీకి చెందిన,వివిధ సంఘాల రాజికీయ తరగతులకు హాజరయేవాడినీ.. .
అలా క్రమం తప్పకుండా, పార్టీ మరియు ప్రజాసంఘాల మీటింగుకీ హాజరౌతుంటే చూసి, ‘ఎస్ ఎఫ్ ఐ’ మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి పీ. నాగేశ్వరరావు, ఎస్ ఎఫ్ ఐ’ ఆఫీస్ కీ రావాలని చెప్పడంతో , బోడ లక్ష్మణ్, నన్ను వెంటబెట్టుకొని ఎస్ ఎఫ్ ఐ’ ఆఫీస్ కూ తీసుకొవెళ్ళాడు. కొద్ది సేపటికి ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి- ‘ఉప్పలయ్యా’ కూడా వచ్చాడూ. ‘ పీ. నాగేశ్వరరావు, ఉప్పలయ్యా, బోడ లక్ష్మణ్, స్కైలాబ్ బాబు, నేను’.. మేమందరం సమావేశమయినము. ‘ నీ కున్నా ఇష్టాన్ని బట్టి నిన్ను ‘ఎస్ ఎఫ్ ఐ’ మహబూబాబాద్ డివిజన్ కమిటీ సభ్యునిగా, తొర్రూరు మండల ‘ఎస్ ఎఫ్ ఐ’ ఇంచార్జీగా బాధ్యతలు తీసుకోవాలని’ ప్రతిపాదించగా, నేను బాధ్యతలు స్వీకరించాను.
— డా.బోంద్యాలు బానోత్(భరత్)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
నా కథ-15 (ఇంటర్మీడియట్)— డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>