ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ‘పదిహేడేళ్ళ ప్రరవే’ ఎనిమిదవ మహాసభలు
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ‘పదిహేడేళ్ళ ప్రరవే’ ఎనిమిదవ మహాసభల సందర్భంగా ‘ద్రావిడ సమాజ సాహిత్యాలు సారూప్యత – ఐక్యత – పోరాటం’ అనే అంశంపై 2026 ఫిబ్రవరి 07 & 08న రెండు రోజుల సదస్సును కెవిఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, క్లస్టర్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేదిక ప్రాంగణానికి దివంగత రచయిత్రి, ప్రరవే జాతీయ అధ్యక్షురాలు పదవిలో ఉండగా కన్నుమూసిన అనిశెట్టి రజిత పేరును పెట్టారు.
ప్రరవే జాతీయ కార్యవర్గం ప్రరవే జెండాను ఎగురవేసి నినాదాలు ఇచ్చారు. ద్రావిడ భాషల ఔన్నత్యాన్ని తెలుపుతూ కర్నూల్ రచయిత మారుతి పౌరోహితం ఆప్తవాక్యం పలికారు.
కళ్యాణి కుంజ అధ్యక్షతన ప్రారంభ సభలో సదస్సు లక్ష్యాలను జాతీయ కార్యదర్శి మానస ఎండ్లూరి వివరించారు. కీలకోపన్యాసంలో పాత్రికేయులు, రచయిత కె. శ్రీనివాస్ అన్నారు. ఈ సభకు గౌరవ అతిధిగా కళాశాల ప్రిన్సిపల్ డా. కె. వెంకటరెడ్డి ప్రరవే చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎంతో హర్షించారు.
ప్రరవే ప్రచురణలో అంబేద్కర్ తాత్వికతపై వచ్చిన వ్యాస సంకలనాన్ని రచయిత జి. వెంకటకృష్ణ ఆవిష్కరించారు. మెట్టు రవీందర్ సమీక్ష చేశారు. అనిశెట్టి రజిత స్మారకోపన్యాసం చేసిన ప్రరవే తెలంగాణ కార్యదర్శి కాత్యాయనీ విద్మహే రజిత సాహితీ ప్రయాణం, ఉద్యమ జీవితం గురించి వివరించారు.
రెండు రోజుల పాటు ద్రావిడ భాషా సంస్కృతి, సాహిత్యం, స్త్రీల సాహిత్యం – సారూప్యం, ద్రావిడ భాషల అస్థిత్వ రాజకీయాల గురించి సి. మృణాళిని, గూండ్ల వెంకట నారాయణ, కల్లూరి భాస్కర్, గడియారం భార్గవ్ విస్తృతంగా మాట్లాడారు. యువత ఆసక్తికరమైన చర్చలు చేశారు.


Comments
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ‘పదిహేడేళ్ళ ప్రరవే’ ఎనిమిదవ మహాసభలు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>