మనిషన్నవాడు ఏడి(కవిత )-డా.బాలాజీ దీక్షితులు పి.వి
మనిషన్నవాడు ఏడి
మనుషులెందుకు
మారిపోతున్నారో
అసూయ పుడితేచాలు
కళ్ళుకూడా
పచ్చగా మరిపోతాయి
ఈర్ష్య కలిగితేచాలు
మంచి కూడా
నిప్పులు పోసుకొంటుంది
ఎవడు గొప్పతనం
వాడిది అనుకోం…మనం
ఒకడు ఎదిగితే
ఓర్చుకోలేం….మనం
దేవుడి గురించి
తీయగ మాట్లాడతాం
దేవుడి లాంటి ప్రక్కప్రాణాన్ని
బాధపెడతాం
-డా.బాలాజీ దీక్షితులు పి.వి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
మనిషన్నవాడు ఏడి(కవిత )-డా.బాలాజీ దీక్షితులు పి.వి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>