అంతర్జాల భూతం(కవిత)- ద్రవిడ హరి
బెట్టింగ్ బాగోతం
వాడవాడలా నేడాయేరాతం
ఎందరినీ మింగునో ఈ భూతం
అడ్డులేదెందుకో జరిగితే ఘోరం
ఆన్లైన్ల ఈ హింసకు
అమాయకులే ఆత్మబలిదానం
ఆశలేపింది చరవాని మైకం
తొవ్వసూపింది ఆశల అంతర్జాల పైకం
కేసినో రమ్మీ కల్చర్
మంట్లే వడేదెప్పుడో
బొంద పెట్టేదేన్నడో
మందిని ఆల్కగా బోర్రేయవట్టే
నాన్న జేబునుండి దోసి
అమ్మ పోపుడబ్బలు బోర్రెసి
తోబుట్టువుల మాయజేసి
తాకతిమించి జూడమాడవట్టే
అలీ పుస్తెలు
అంగట్ల తాకట్టు పెట్టి సైతం
ఆల్కగా అత్తయని నమ్మి
బెట్టింగ్ బాగోతలకు బలైన కుటుంబాలెన్నో….
రెండుమూడింతలకు ఆశపడి
ఉన్నదంతా ఊడిసిపెట్టి
మోసపోయామని తెలుసుకొని
ఉరికొయ్యలకు ఎలాడవడ్డ జివ్నాలేన్నో..
పసి కూనలెందరినో
బెట్టింగ్ భూతం పీడిచ్చిన
అభయమియ్యలేదే ఏ దేవుడు
కాపాడ నిలువరాడాయే జగతికి నేడు
-ద్రవిడ హరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
Comments
అంతర్జాల భూతం(కవిత)- ద్రవిడ హరి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>