నా కథ- 17( ఇంటర్మీడియట్- తిరుమలగిరి)- — డా.బోంద్యాలు బానోత్(భరత్)

అది 1997-1998 వ సంవత్సరం. 1996-1997 వ సంవత్సరంలో, తొర్రూరు లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతూ, ‘ఎస్ ఎఫ్ ఐ’ సిద్ధాంతముకు ఆకర్షీతుడనై , కాలేజీకి పోవడం తగ్గించి, ‘ఎస్ ఎఫ్ ఐ’ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం వలన, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫైనల్ పరీక్షలు రాయలేదు. ఎందుకంటే ? ఆ సంవత్సరం అంతా ఉద్యమాలకే సరిపోయింది. అందరు పరీక్షలు రాసి ఆనందంగా ఉన్నారు. కాని నాకు ఆ పదిరోజులు చాలా భారంగా గడిచాయి. ఒకరోజు నిద్రపట్టలేదు. తెలందాక ఆలోచనలో “నేనెందుకు పరీక్షలు రాయలేదు!?, సమయమంతా ‘ఎస్ ఎఫ్ ఐ’ కార్యక్రమాలకే కెటాయిస్తే, చదువు సంగతి ఏంకావాలి?, ‘ఎస్ ఎఫ్ ఐ’ లో పనిచేయవద్దా!?, అంటే ‘ఎస్ ఎఫ్ ఐ’ లో మనము చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు?, ఇట్లకాదు, కాని ‘ఎస్ ఎఫ్ ఐ’ లో పని చెయ్యాలి, దానితో పాటుగా చదువుకోవాలి!. ఎందుకంటే ‘ఎస్ ఎఫ్ ఐ’ లో పనిచేయడం ముఖ్యమే, అదేవిధంగా చదువు కూడా ముఖ్యమే. అంటే ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవలసిన అవసరం ఉంది.” అని భావించి 1996-1997 సంవత్సరంలో పరీక్షలు రాయలేదు, కాని కావలసినంతా జ్ఞానం, అనుభవము పొంద్యాను. 1997-1998 వ సంవత్సరంలో, తిరుమల సహాకార జూనియర్ కళాశాలలో, మళ్ళీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందాను.
మొట్టమొదటి రోజున కాలేజీకి వెళ్యాను. ఆరోజున కళాశాలకు వచ్చిన వాళ్ళందరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. నేను కూడా పరిచయం చేసుకోని, ” నేను ఇక్కడ రూం లో ఉండి చదవాలనుకుంటున్నాను. ఇందులో ఎవరైనా రూం తిసుకొని చదువుతున్నట్లైతే, నా కోసం ఒక రూం చూడగలరు. లేకపోతే, మీ రూంలోనైనా ఖాళీ ఉంటే! చెప్పండి నేను మీ రూంమేట్ గా చేరుతాను. ” అని చెప్పాను. ఈ విషయంలో తాత్కాలికంగా, ఎవరు మాట్లాడలేదు. మధ్యాహ్నం 3:30 గం.. అవుతుంది. కళాశాల వదిలే బెల్లైంది. అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళు తున్నారు. నేను తిరుమలగిరి ఊళ్ళోకి వెళ్ళుతున్నాను. ఐతే ఊరికి మా కాలేజీకి మధ్య 1కిలో మీటర్ దూరం ఉంది. మా కాలేజీ నుండి నడుచుకుంటూ వచ్చి రోడ్డెక్కి తిరుమలగిరి వైపుకు తిరిగి నడుస్తున్నాను. పిలుస్తే పలికేయంత దూరంలో, నా ముందు ఇద్దరు విద్యార్థులు నడుస్తున్నారు. వాళ్ళు, ఏదో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. నేను అంతే దూరంగా నడుస్తున్నాను. వాళ్ళు సడెన్గా ఆగి ” హలో బ్రదర్ తార్ నామ్ కాఁయిఁ?” అని అడిగారు. ” మార్ నామ్ ‘బొంద్యాలు బానోత్ ‘ చ. తో, తూ రూం రేణో కేరొతొ కోని కా!?. హావ . తో రూం హమ్ రే రే జత చ. పణన్ ధర్యతీ వాతే కర్ణో లాగచ. ఊ గొరేర్ చిఛారేన్ తప్పా కేని దేని. అయన కొన్ని నియమాలు చెప్పుతాడు, వాటిని తప్పకుండా పాటించాలి.” అని వాళ్ళు చెప్పగా, సరే దానదేముంది, మనము పాటించలేని విషయాలైతే చెప్పరు.
మనము చెయగలిగేవే, చెపుతారు. మీరు కూడా పాటిస్తారు కదా!?. మీతో నేను. మీరెలా నడుచుకుంటున్నారో, నేను కూడా అలాగే నడుచుకుంటాను, అని చెప్పాను.” అలా, మాట్లాడుకుంటూ పోతున్నాము. ఇంతలోనే, దొర గడి వచ్చేసింది. ‘ఇదే మనము ఉండబోయే ఇల్లు’ అని అన్నాడు ‘మాన్య’. ఆ ఇల్లు, ఆ ఊరి దొర ‘గడి’. అది పేరుకే గడి కాని దేవుని గుడి మాదిరిగా ఉంది. దాని తలుపులు( పాట్రిక్ లు) పెత్తెడు మందంతో, పొడవు, వెడేల్పుగా ఉన్నాయి. అస్తమానము వాటిని తీయడం, పెట్టడం కష్టం, కాబట్టీ, ఇందులోనే ఒక చిన్న దర్వాజా ఏర్పాటు చేశారు. మనుషులు దాని గుండానే పోవడం-రావడం చేస్తూంటారు. కారో, ఎడ్లబండో లోపలికి రావాలంటే, అప్పుడు మాత్రమే ఆ పెద్ద తలుపులను తెరుస్తారు. ఆ ద్వారానికి ఇరువైపులా (కుడివైపున మూడు రూములు -ఎడమవైపున మూడు రూములు) ప్రహారి గోడను కలుపుకోని నిర్మించినారు. ఇక లోపల విశాలమైన ప్రదేశంలో పెద్ద భవనం ఉంది. చుట్టుపక్కల చాలా విశాలమైన ఖాళీ స్థలం ఉంది. అందులో రకరకాల- పూల చెట్లు, పండ్ల చెట్లు, వేరే రకాల చెట్లు ఉన్నాయి. ఐతే ఆ ఇంటి ద్వారానికి ఇరువైపులా ( ఎడుమ వైపు మూడు రూములు మరియు కుడివైపున ఉన్నా మూడు రూములు) అన్ని కలిసి ఆరు(6) రూములు ఉన్నాయి. ఈ రూములను , ఇంటర్మీడియట్ చదివే లంబాడీ స్టూడెంట్స్ కు మాత్రమే, ఉచితంగానే ఇచ్చేవాడు. పేద పిల్లలకు ఉచితంగా రూములు ఇచ్చీ, సహాయం చేస్తున్నట్లు ప్రచారం చేసేవాడు. కాని అందులో ‘ఆర్ ఎస్ ఎస్’ శాఖా నడిపేవాడు. ఈ రూముల్లో ఉండేవాళ్ళుకు తప్పని సరిగా శాఖ కు హాజరుకావాలని నిబంధన పెట్టేవాడు…
ఐతే, నేను మా కాలేజీ మేట్స్ బానోత్ మాన్య, లాలు.. వాళ్ళతో ఉన్నాను. ఆ రూములు, ఇల్లు, గడీ ప్రాంగాణం అంతా చూశాను. అంతా నచ్చింది. “నేను కూడా మీతోనే ఉంటా” అని మనుసులో మాట వాళ్ళుకు చెప్పాను. “మాకేమీ అభ్యంతరం లేదు, నువ్వు మాతోటి ఉంటే, మాకే మంచిది. మంచిగా అందరం కలిసి ఉండవచ్చు. కాని దొర ఒప్పుకోవాలె కదా!?, సా యంత్రం దొర రాగానే అడుగుదాం, ఏమంటాడో తెలుసుకొందాము, ఉండమంటే హ్యాపే, లేదంటే ఇక్కడే , పక్కన కిరాయికీ రూములు వెతుకుదాం” అని అన్నాడు మాన్య. “ఏ.. ! ఎందుకియ్యడె? రూములు ఖాళీగానే ఉండే! ఏం చేసుకుంటాడు!? ఇయ్యక పోతే!?” అని అన్నాడు లాలు.
సాయంత్రం 6: 00 గంటరైంది. దొర కారు వచ్చింది. దొర కారు దిగి, గంగాళం వద్దకు వెళ్ళి కాళ్ళు-చేతులు కడుక్కుని, పని మనిషి తువ్వాల తెచ్చి ఇవ్వగా, చేతులు- ముఖము తూడ్చకోని చకచకా ఇంట్లో కెళ్ళి, బట్టలు మార్చుకొని, వరండాలోకి వచ్చీ , కూర్చీ మీద కూర్చోనగా, పని మనిషి ఫ్యాన్ ఆన్ చేసిందీ.
ఇంతలోనే ఆ రూముల్లో ఉండేవాళ్ళు తయ్యారై, దొర ముందు లైనుగా నిల్చుని ఉన్నారు. నన్ను కూడా లైనులో నిల్చోమని, నిలబెట్టారు. ” నెంబర్ వన్ ( 1) బానోత్ మాన్య.. ‘ ఉన్న అయ్య’, నెంబర్ 2 లాలు-, ‘ ఉన్న దొర ‘ , … ” ఆ మొత్తం – ఆరు గురు ఉన్నారా?” , “ఉన్నాం దొర” అన్నాడు మాన్య. “కాని ఈ రోజు ఒకళెక్కువ ఉన్నారు కదా!?. ” అవును దొర, ఈయన కూడా మా కళాశాలలో జయినయిండు. మన రూంలో ఉంటాడట..దొర!, మీరు అనుమతిస్తే.. ఉంటా అంటున్నాడు.. దొర!. “ఆ మాట అతను అనాలె కదా! నువ్వంటే ఎట్లా..!?.” “ఏ..! తూ కచ కేనీ…” అన్నాడు మాన్య. అవును దొర నేను కూడా వీళ్ళతో ఉంటా. ” ఉంటావు నిజమే కానీ, ఇక్కడా కొన్ని నియమాలు, పద్దతులు పాటించవలసి వుంటుంది. మరి నువ్వు పాటిస్తావా? పాటిస్తానంటే ఉండూ లేదంటే లేదు. అర్థమయింద?” అని అన్నాడు దొర. “వీళంధరితో పాటుగా నేను పాటిస్తా, దొర.” అని అన్నాను. అంటే వాళ్ళు పాటించక పోతే నువ్వు పాటించవా!?. వాళ్ళ సంగతి వదిలేయి, నీ సంగతి చెప్పు, నువ్వు పాటిస్తావా లేదా?. “నేను పాటిస్తా దొర.” అని అన్నాను. ” ఇట్లన్నవు బాగుంది.
నీ పేరు, తల్లి తండ్రుల పేర్లు, ఊరు , మండలం, జిల్లా, ఈ రిజిస్టర్ లో రాయండి. నువ్వు పాటించవలసిన నియమ-నబంధనలు- ఇంటికి పోయి నప్పుడు తల్లి-తండ్రుల కాళ్ళు మొక్కాలి. వచ్చేటప్పుడు తల్లి-తండ్రుల కాళ్ళు మొక్కీ రావాలి. లుంగీ కట్టకూడదు, తెల్ల పైజామా డ్రెస్ లో ఉండాలి. తెల్లారేసరికి కాల్ల కృత్యాలు , స్నానాలు అయిపోవాలి. ఆదివారం మరియు సెలవు రోజుల్లో మీటింగు కీ తప్పనిసరిగా హాజరు కావాలి.” ఇవి మీరు చెయ్యవలసినవి, అని అన్నాడు దొర. అందుకు నేను ఒప్పుకున్నాను. ” కాని నాకు సందేహంగానే ఉంది. ఎందుకంటే! లుంగీ కట్టకూడదు, తెల్ల పైజామ మాత్రమే తొడుక్కోవాలి.. ఇవన్నీ వింటుంటే.. అతడు ఇంత మంచి రూములు ఊరకనే ఇవ్వట్లేదు అనిపించింది. దీని వెనకాలా ఏదో కథ నిడిపిస్తున్నాడు అని అనుకున్నాను. సరేతీ చూదాం..!ఎట్లైతే గట్లే!.” అని అనుకున్నాను.
ఆ రూములో ఉండీ కాలేజికి వెళ్ళుతున్నాను. రోజులు గడిచిపోతున్నాయి. కాలేజిలో మంచి పేరు వచింది. చదువుతోపాటూ విద్యార్థీ రాజికియాలు చేస్తున్నాను. విద్యార్థుల్లోను మంచి పేరు వచింది. ఐతే గత సంవత్సరం చేసిన విద్యార్థీ రాజికీయాలు మళ్ళీ గుర్తుకొచినయి. చదువు కుంటూ ఎస్ ఎఫ్ ఐ లో పని చెయ్యలనుకున్నాను. అటు చదువును-ఇటు విద్యార్థీ రాజికీయ్యాలను సమన్వయం చేసుకోవడం తెలిసిందీ.
గోడలమీద ‘ఏ పీ ఎస్ ఎఫ్ అని రాసివుంది. అది బీయన్ రెడ్డీ పార్టీ నుండి విడిపోయిన సంఘమని అర్థమయిందీ. దానికీ నాయకుడూ ‘ చేను శ్రీను’ ఉన్నాడు. ఆయన బీయన్ రెడ్డీతో ఉన్నాడు. నేనొకరోజు అతన్ని కలిశాను…” నా పేరు ‘భరత్ నాయక్’,నేను తిరుమల కాలేజిలో ఇంటర్మీడియట్ చదువు తున్నాను. నేను ఇంతకుముందు వరంగల్ జిల్లా, మహబూబాబాద్ డివిజన్ లో, ఎస్ ఎఫ్ ఐ లో పని చేశాను. ఐతే, ఇక్కడ కూడా ఎస్ ఎఫ్ ఐ లో పని చెయ్యలనుకున్నాను. ఐతే, ఇక్కడ నాకు ఎవ్వరు తేలియదు. గోడల మీద ‘ఏపీ ఎస్ ఎఫ్’ చేను శ్రీను అని రాసివుంది. ఆ పేరుతో చాయి హోటల్ వాళ్ళను అడుగగా, మీ ఇంటి అడ్రస్ చెప్పాడు. ఇలా వచ్చాను.” అని నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ” ఐతే, మీకిప్పుడు ఏంకావాలి?”, “ఏమీ లేదు కాని, ఇక్కడెవరన్నా ఎస్ ఎఫ్ ఐ లో పనిచేసేవాళ్ళూ ఉంటే, వాళ్ళ పేర్లూ, అడ్రస్ కావాలి.” లేదు, బీన్ విడిపోయిన తర్వతా, నేను బీన్ తో వచ్చేసిన, ఆ తర్వాతా వాళ్ళు నాతో కలవడం మానేశారు. వళ్ళకీ నాకూ లింకు తెగిపోయింది. సరె మంచిది తమ్ముడు తర్వాత కలుద్దాం! నాకు పని ఉంది.” అని వెళ్ళిపోయాడు. నేను కొంచం నిరాశతో తిరిగి వచ్చాను. కాని నాకు కాలేజిలోనే కలుస్తారు అనే నమ్మకం ఉంది.
ఊరికి కుడిపక్కన, దొర గడికి కుడి పక్కన, వాకబుల్ దూరంలో, పొలంలో ఒక ‘బాయి’ లో రోజు స్నానం చేసేవాడిని. ఆదివారం రోజున మధ్యాహ్నం, బట్టలు పిండుకోని, స్నానం చేస్తుండగా..ఇద్దరు యువకులు స్నానం చేయడం కోసం వచ్చారు. అక్కడా వాళ్ళతో మాటా-మాటా కలిసి, మాట్లాడుకుంటున్నాము. వాళ్ళుకూడా విద్యార్థులు కావడంతో, విద్యార్థీ సంఘాల ప్రస్థావన వచ్చింది. అప్పుడు నేను ఎస్ ఎఫ్ ఐ లో పని చేశాను. ఇక్కడ కూడా చెయ్యాలని ఉంది కాని, ఇక్కడ, వాళ్ళు నాతో పరిచయం లేదు.” అని అన్నాను. ఐతే, వాళ్ళలో ఒకరు “నాకు ఎస్ ఎఫ్ ఐ వాళ్ళు తెలుసు. కావాలంటే నేను పరిచయం చేపిస్థా, సూర్యాపేట డవిజన్ కార్యాదర్శి ‘నాగభూషణం’ ” అని అన్నాడు. సరే మంచిది. నా పేరు ‘భరత్’, తిరుమల కాలేజిలో ఇంటర్మీడియట్ చదువు తున్నాను..” అని చెప్పాను. ” తిరుమలగిరి మండల అధ్యక్షుడు ‘మల్లయ్యా’ మా బాబాయి, సీపీయం పార్టీ. కావాలంటే ఆయన్ని కూడా పరిచయం చేపిస్థా.” అని అన్నాడు. ఆ విధంగా వాళ్ళు పరిచయం అయ్యారు.
ఒక రోజు నాగభూషణం సూర్యాపేట డవిజన్ కార్యాదర్శి నాతో మాట్లా డి” తిరుమలగిరి మండల పరిదిలో ఎవ్వరు లేరు అనుకొనే సమయంలో మీరు ఇక్కడికి రావడం, ఎస్ ఎఫ్ ఐ చాలా ఉపయేగకరం. మీరు వరంగల్ జిల్లా మహబూబాబాద్ డివిజన్ స్థాయిలో చేసియున్నారు కాబట్టీ , మీరు ఇక్కడ కూడా డివిజన్ స్థాయిలోనే తీసుకుంటాము. ఈరోజు మనము సూర్యాపేట డవిజన్ ఆఫీస్ పోదాము.” అని నన్ను సూర్యాపేట డవిజన్ ఆఫీస్ కు తీసుకెళ్ళాడు. అక్కడా ఇతరా నాయకులతో పరిచయం చేశాడు.” త్వరలోనే మనము విద్యార్థుల సమస్యలపై, విద్యార్థులతో, ర్యాలీలు, ధర్నాలు..చెయబోతున్నాము. తిరుమలగిరిలో చాలా బాగా విద్యార్థులను సమీకరించాలి. ఎందుకంటే మీరు అనుభవమున్న లీడరువే,కాబట్టీ చెయ్యగలుగుతావు.” అన్నాడు. ఆ తర్వాతా కాలేజికీ వెళ్ళున్నా.. సాయంత్రం సమయాన హస్టల్లూ తిరిగి, చెయ్యబోయే కార్యక్రమం గురించీ చెప్పుతూ, నన్ను నేను పరిచయం చేసుకొంటూ..తిరిగాను. స్కూల్లకు వెళ్ళాను, కాలేజిలకు వెళ్ళాను. ప్రవేటీకరణ, ఫీజుల పెంపూ… ప్రభుత్వాల విద్యార్థుల వ్యతిరేక విధానాలను వివరించాను.. .
తర్వాత 15 రోజులకు, రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా తిరుమలగిరి మండల కేంద్రములో 500 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి, మండల ఆఫీసు ముందు ధర్నా చేశాను. ఆ కార్యక్రమం విజయవంతమయింది. ఐతే, ఈ కార్యక్రమాన్ని గమనించిన ‘ఏబీవీపీ’ తిరుమలగిరి మండల బాధ్యుడు ‘… రెడ్డి ‘ , నా గురించి తెలుసుకొని, నా అడ్రస్ వెతికాడు. ఐతే, నేను ఆ దొర ఇంట్లోనే ఉంటున్నా , అని తెలుసుకోని, దొర ఇంటికి పోయి, “దొర గారు మన శతృవులనే మన ఇంట్లో ఆశ్రయమిస్తే ఎట్లా!?, చెపండి..?” అని అడిగాడు. దొర పరేశానై “నేను మన శతృవును మనింట్లో పెట్టకోవడమేంటీ? అసలు మీరేమంటున్నారు..!?. ఎవరతను, పేరు చెప్పు .” ” పేరు ‘భరత్’, ఎస్ ఎఫ్ ఐ లో పనిచెస్తున్నాడు. హాయిగా, ఉచితంగా, మీ ఇంట్లోనే , మీరిచ్చిన రూంలోనే ఉంటున్నాడు. 500 వందల మంది విద్యార్థులతో ర్యాలీ తీసీ, ధర్నా చేశాడు. “వరండాలో కుర్చీలో కూర్చూన్న దొర, పని మనషితో రిజిష్టర్ తెపించి, పేర్లు చదివాడు. ‘భరత్’ అనే పేరు ఆ రిజిస్టర్ లో లేదు. ” ఏమయ నువ్వు చెప్పిన ఆ ‘భరత్’ అనే పేరు ఈ రిజిస్టర్ లో లేదు. మా ఇంట్లా ఉన్నోళ పేర్లు అన్ని నా రిజిస్టర్ లో రాసిపెట్టాను. ఐన సరే, సాయంత్రం వాళ్ళు వచ్చాక, అడిగి చెప్పుతా. నిజంగానే ఎవడన్నా ఉంటే వెంటనే ఖాళీ చేపిస్తాను.” అని దొర అన్నాడు. ” మీరు ఏమన్నా చెయండి, వాడు మాత్రం మన గడిలో ఉండ డానికి విల్లేదు. ఇదేందండీ, ఎక్కడా చూడలేదు, మనింట్లో ఉంటూ, మనకు శతృ సంఘంలో పనిచేస్తున్నాడు. ఎంత ధైర్యం వాడికి!?.” అని అనుకొంటు వెళ్ళిపోయాడు ఏబీవీపీ ‘… రెడ్డి.'(పూర్తి పేరు గుర్తుకు రావడం లేదు. కాని అతను రెడ్డి సామాజిక వర్గం)
సాయంత్రం 6:00 గంటలకు దొర హాజరు తీసుకొనే సమయం. గడి రూముల్లో ఉన్నవాళ్ళు అందరు హాజరైయ్యారు. వరుసగా పేర్లు చదివాడు. “అందరు ఉన్నారు. మరి ఈ ‘భరత్’ ఎవ్వరు?, మీలో ఎవరికైన రెండు పేర్లు ఉన్నాయా?” అని అడిగాడు ‘సీతారామరాజు దొర’ . అప్పుడు నేను స్పందిస్తూ “అవును దొర, నాకు రెండు పేర్లు ఉన్నాయి.” ” అంటే ఏమిటవి? .” ” ఒకటీ ‘బొంద్యాలు బానోత్’, మా తల్లీ- తండ్రులు పెట్టిన పేరు. రెండవ పేరు ‘భరత్’, మా మితృలు పెట్టిన పేరు ” అని అన్నాను. ” మరి ఈ పేరు ‘భరత్’ కూడా ఉంది అని నాతో ఎందుకు చెప్పలేదు?, ఇక్కడ ఎందుకు రాయించలేదు..?. నువ్వు ఎర్ర జెండా పార్టీలో పని చేస్తావట కదా!?. నువ్వు నగ్జలేటువటకదా..! నీ కోసం పోలీసులు వచ్చారు. ఇంటెలీజెన్స్ వాళ్ళు వచ్చారు. నిన్ను పట్టుకొపోతే, ఎవరు బాద్యులు, మీ తల్లీదండ్రులు వచ్చీ ఎవరినడుగుతారు..?. నువ్వు వెంటనే మా రూమును ఖాళీ చేసి వెళ్ళీపోవాలె, అర్థమయిందా.. !?. అంటే ఈ రోజు చికటి పడింది, కాని రేపు మార్నింగ్ మార్నింగ్ గే ఖాళీ చెయ్యాలి.” అని అన్నాడు దొర.
దొర గారు, మీరు ఈ విధంగా ఏదేదో అంటున్నారు..! కాబట్టీ, నేను మీకు చెప్పేంత వాణ్ణి కాను. కాని చెప్పకుంటే విషయం అర్థంకాదు. మీరు రూంమిస్తామంటేనే వచ్చి ఉన్నాను. మీరు చెప్పిన నియమ- నిబంధనలు పాటించాను. నేనె ఓ దొంగనూ కాదు, లంగను కాదు, మీరనుకునే నక్సలైట్ ను, అంతకూ కాదు. నేను చదువుకొనే పేద విద్యార్థిని, పేద విద్యార్థుల సమస్యల కోసం పని చేస్తూన్నా విద్యార్థి సంఘం ‘ఎస్ ఎఫ్ ఐ’ లో పనిచేస్తున్నా . నా పేరు ఇంటెలీజెన్స్ వాళ్ళ వద్దా ఉన్నది. నేను మీ ఇంట్లోనే ఉండి మొదటి సంవత్సరం పాసైయ్యాను. మీరు చేసిన ఈ సహాయం, ఎప్పటికీ మరిచి పోను. రేపు మధ్యాహ్నం వరకు రూము వెతికీ, సాయంత్రం వరకు ఖాళీ చేసి వెళ్ళి పోతాను.” అని చెప్పాను. “సరే మంచిది” అన్నాడు దొర.
ఆ రాత్రి నిద్ర పట్టలేదు . ఇన్ని రోజులంటే నేనెవరో వాళ్ళకు తెలియదు, నా రాజికియాలు, నా ఐడియాలజి ..వాళకు తెలియదు. మనింట్లో ఉంటున్నాడు కనుకా, మనపార్టియే అనుకున్నారు. ఇంత పెద్ద గడిలో, ఓకే ఒక్కడు సీతారామరాజు ‘దొర’ ఉంటున్నాడు. ఆయన 70-80 సంవత్సరాల మద్య ఉంటాడు. ఇద్దరు పని మనుసులు. ఒక్కరు మగ మనిషి, పెరు గుర్తుకు రావడం లేదు కాని అతును ఈదులపర్రె లంబాడి తండకు చెందినవాడు. దొరకు నమ్మకస్తుడు, కావలసిన విధంగా వంట చేసి పెట్టేవాడు. రెండవవారు మహిళ. ఆమె అదే ఊరికి చెందిన మాదిగ కులస్తురాలు. ఆమె వయస్సు 60-70 సంవత్సరాల మద్య ఉంటుంది. ఆమె ఇల్లూ వాకిలి ఊడవడం, నీటగా ఉంచేది. ఆమెకి లోకం తెలిసిన నాటి నుండి ఇదే గడిలో పని చేస్తుందని విన్నాను..
— డా.బోంద్యాలు బానోత్(భరత్)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
నా కథ- 17( ఇంటర్మీడియట్- తిరుమలగిరి)- — డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>