కవిత ఓ మంచి కైత*- (కవిత)- జాడి మహేష్,
సూక్ష్మ దృష్టి తొడ కవి సృష్టించు కవిత
జన హితము కోరు అక్షర కూర్పు కవిత
ఛందోబద్ద నియమం గల పద్య కవిత
ప్రకృతి మేలు కోరు ప్రకృతి కవిత
భావ ప్రసరణ చేయు భావకవిత
భావలను తర్కించు
విమర్శ కవిత
జనులకు ప్రేమ పంచు ప్రేమ కవిత
ఊహలో విహరించు కాల్పనాత్మక కవిత
సుకుమార సౌందర్యం చూపు లాలిత్యం కవిత
దైవ చింతన పెంచు ఆధ్యాత్మిక కవిత
ఎడద లో భక్తి నింపు దేశభక్తి కవిత
అన్య భాష రూపు తెలుపు అనువాద కవిత
దేశీ భాషకు పునర్జీవం సుకవుల కవిత
మనిషిలో మానవీయత
రస రచన కవిత
దేశ సమగ్రత కై అమలిన
కవిత
విశ్వ శాంతి కోరు విభుద కవిత
శైశవమందు జోలపాట కవిత
బాల్య మందు పద్య విద్య
కవిత
కౌమారమందు గజిబిజి కవిత
యవ్వనము మధుర ప్రేమ కవిత
యుక్త వయస్సు నాడ బాధ్యత కవిత
మధ్య వయసు లోన భక్తి భావం కవిత
చరమాంకమందు కైవల్యగీతం కవిత
అంతిమాన చరమ గీతం కవిత
సెలయేటి గలగల కవిత
స్మశానంలోన నిశ్శబ్దం కవిత
మనిషి జీవితమే కవిత
మనిషి మంచి కోరే కవిత
— జాడి మహేష్,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
కవిత ఓ మంచి కైత*- (కవిత)- జాడి మహేష్, — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>