మనతో మనం (కవిత)- భోజన్న తాటికాయల
మనను మనం కొత్తగా నిర్మించుకుందాం
ఎన్నో మనతో ఉంటాయి
ఎన్నో మన నుండి పోతాయి
ఎప్పుడూ మనం ఒకటి మర్చిపోతము
ఏదో వచ్చి ఆనందానికి గురి చేస్తుందని
గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్
నన్నయ చెప్పిన మాటే వేదం…
వచ్చే కాలాన్ని సుందరంగా ఊహించుకుంటాం
గడిచిన కాలాన్ని భూతంలా తరిమికొడతాం
గడపబోయే కాలాన్ని పట్టికలుగా రూపొందిస్తాం
మారాలంటూ, మార్చాలంటూ కొత్త కొత్త సూక్తులు ఇస్తాం
ఒకటో రెండో రెండు, మూడు రోజులు పాటిస్తాం
మళ్లీ యధావితే…
ఈ సంవత్సరము గడిచిపోతుంది
ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచాయో
వెనుకకు తిరిగి చూస్తే ఒక్కసారిగా తల తిరుగుతుంది
అయినా సరే
ఏం పాటించిన లేకపోయినా
ఎంచక్కా ప్రణాళికలు మాత్రం సిద్ధం చేయడమే
ఎంతో కొంత మారినా చాలు ఈ జీవితం
బంధాలను చక్కగా పెన వేసుకుందాం
బాధ్యతలను బాధ్యతతో తీసుకుద్దాం
బలహీనతలను బలపరుచుకుందాం
భారాలను దూరం చేసుకుందాం
భావ అభ్యుదయాలలో ముందుందాం
భావి భారతానికి మన వంతు ఏదో ఒకటి చేద్దాం
ఈ కొత్త సంవత్సరాన్ని అణువణువు వాడుకుందాం
గడిచిన పాత సంవత్సరాన్ని
వినయంగా ముందుకు నడవనిద్దాం
నా, మన స్వార్థాలను వదిలివేసి
మనం అనే శక్తి మంత్రం పాటిస్తూ…
లోకంతో కలిసి నడుద్దాం
లోకాన్ని ప్రేమిద్దాం
లోకంతో కలిసి ఉందాం
లోకంలోనే మరణిద్దాం
మాటలిద్దాం
ఇచ్చిన మాటలు నెరవేర్చుదాం
పశుత్వాన్ని వదిలి
దైవత్వాన్ని నింపుకుందాం
గతాన్ని , భవిష్యత్తును వదిలేస్తూ
వర్తమానాన్ని ఆస్వాదిద్దాం
అత్యాశ కోరికలను వదిలేసి
అద్భుత జీవితాన్ని సాకారం చేసుకుందాం
నూతన సంవత్సర శుభాకాంక్షలు (2025)
– భోజన్న తాటికాయల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
మనతో మనం (కవిత)- భోజన్న తాటికాయల — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>