“తెలుగునాడు”కు,చ్రేవ్రాలు (కవిత)-సత్యనారాయణ.యం.ఎ.లిట్.

అమ్మ ఒడిని తలపించే!
“అ”కారం…
తొలితెలుగు”నుడి”కారం
అదెలే మమతల సాకారం.
అచ్చులు, హల్లులు,
ఉభయాక్షరాలు వెరసి,
యాబదిఆరు అక్షరాలు
తెల్గువాడి,జీవ నాడులు.
అరువదినాల్గు!కళలకు కాణాచి.
తెలుగే!సంప్రదాయాల వారణాసి.
నాడు!
దేశభాషలందు!తెలుగు”లెస్స”ని
కొనియాడిన వైభవం!ఆ,అనుభవం
మళ్ళీ,మళ్ళీ,నా! మదిని తాకాలి.
గతమెంతో “ఘన”కీర్తని కాదోయ్..
వర్తమానం,నవ్వభవ్వ వసంతమై,
గడప,గడపకు,గుండె గుండెకు..
తెలుగే వెలుగుల తొరణాలై,
“తెలుగునాడు”కు
కీర్తి క్రాంతి నద్ధాలి.
తెలు”గుణ” నీ చ్రేవ్రాలు”
విశ్వవ్యాప్త మైనవేళ..!
తెల్గుతల్లి !ఎద పై”
“త్రివర్ణ”జెండా ఎగరాలి.
తెలుగు”వాణి”ఖ్యాతి
దేధీప్య మానమై.,
అంబరాన్ని ముద్దాడాలి.
తెలుగు గోడి…!
గండర గండర పౌరుషం
గుండె,గుండేను తాకాలి.
ప్రాచీనాంధ్ర”పద్య”పడతుల
యతి,ప్రాసల,వయ్యారాలు..
ఆధునిక కవితాకన్యకా!ఎదలో..
అలంకార స్వర్ణాక్షర శోభితమై,
పండిత,పామరుల నుదుట
నూతన తిలకం దిద్ధాలి.
తెలుగే వెలుగై జ్వలించాలి.
నవ్వాంధ్ర ప్రదేశ్..
నిత్య నిర్మలమై..!
“వికసిత “భారత్ కు
వెన్నుదనై నిలిచే వేళ!
“అమరావతి”…
ధీర్గాయుస్సు పొంది.
తెలుగు తల్లి!
మురిపెంగా!నవ్వాలి.
తెలుగుభాష,తెలుగుయాస,
తెలుగుకీర్తి,మూర్తీభ విస్తూ..!
అమృత తుల్యమై,
యీ.”త్రిలింగ”భాష,
మృత్యు ఘోషను పరాభవించి.
అజరామర,అజంతా భాషయై
విశ్వ విఫణిలో వర్థిల్లాలి..
విశ్వంబరాన”జ్ఞాన”పీఠికలు
తెలుగు కవితకు పట్టంగట్టాలి
అందుకే..
మా!తెలుగుతల్లి కి!మల్లే పూదండ.
మా! కన్నతల్లి కి!మంగళారతులు.
జై,తెలుగు.జయహో తెలుగు.
-సత్యనారాయణ.యం.ఎ.లిట్.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

విహంగ సాహితీ మాస పత్రిక మనస్సును తాకే సాహితీ వ్యాసంగానికి పెద్ధపీట వేస్తూనే. సామాజిక పరివర్తనకై కృషి చేస్తూ. మహిళా మూర్తుల మనోవికాశానికి చేయూత నివ్వడం అభినందనీయం..అలానే నాచే లిఖించ బడిన తెలుగునాడుకు చ్రేవ్రాలు కవిత ప్రసురించినందులకు గాను, పూర్వక ధన్యవాదములు.. మీ హితైషి.. ధిక్కార ఖడ్గకవి.పినిపే.సత్యనారాయణ.అమలాపురం.