నిశీధి చీకటి నుండి..(కవిత)-గంజి. కుమార్ రాజా

పైకి కనిపించే
ఆ నవ్వు వెనుక
బయటకు వ్యక్త పరచకుండా
ఎదలోనే చిదిమేసికున్న
భావాల వ్యధలెన్నో….
తనలో తానే ఎదలో మదనపడుతూ
తన నిశీధి చీకటి గదిలో
కుమిలిపోతున్న సమయంలో
ఎద ఘోష వినడానికి
వచ్చిన తన అంతరాత్మతో..
జీవిత పోరాటంలో
ఓడిపోయిన ఒక అసమర్థున్ని…
జీవన పయనంలో ప్రపంచంతో
పోటీ పడలేక చతికిలపడి
ఓటమి ఒప్పుకోలేక
మోసగిస్తూ, మోసం చేసుకుంటూ
కాలం గడుపుతున్నవాడను…
అప్పుడు!
తన అంతరాత్మ చెబుతుంది
బాధపడకు నేస్తమా..
ఆత్మ విశ్వాసంతో ముందుకు నడువు
ఏదో ఒకరోజు
విజయం సాధిస్తావు
అని తనతో తానే ధైర్యం చెప్పుకుంటుంది.
-గంజి. కుమార్ రాజా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
నిశీధి చీకటి నుండి..(కవిత)-గంజి. కుమార్ రాజా — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>