మహిళామణి`(కవిత)హరిప్రియ

సంఘర్షణలతోనే
నీ జీవితం మొదలు
తల్లిదండ్రులు సైతం
చూపుదురు భేదభావములు
తోడబుట్టిన వారితో కూడా
అనుభవం నీకు *కన్నీటి సుడులు*
అయినా…….
*ఆలిగా చెల్లిగా*
మరిపించడం నీకే చెల్లు….
కష్టమొస్తే మూగగా విలపించేవు
శోక సంద్రాన్ని మౌనంగా భరించేవు
పంటిబిగువున దుఃఖాన్ని ఆపేవు
పురిటినొప్పులో నరకాన్ని భరించినా
పసికందులో స్వర్గాన్ని చూసేవు
బిడ్డల భవిష్యత్తుకై
రక్తాన్ని ధార పోసేవు
ఎంతటి అవరోధాన్నై
నా అలవోకగా దాటేవు
*ఆదిపరాశక్తివి* నీవు
మానవత్వానికి మరోరూపం నీవు
కానీ జీవితం నీకు మిగిల్చేను
*అవమానాల* *జ్ఞాపికలు*
మహిళా….
ఎందరికి ఆదర్శం నీవు….. ఐనా
భగవంతుడు సైతం
కాంచడు నీ వెతలు
-వందవాసి హరిప్రియ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
మహిళామణి`(కవిత)హరిప్రియ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>