వారసత్వవీలునామా(కవిత )మనురామ్.
ఓ తల్లిదండ్రులారా!
పసిప్రాణంపాదాలకు
పట్టీలుకడుతున్నప్పుడు
అవిఅందానికా?
లేక…….
అడుగులపరిధినినిర్దేశించేసంకెళ్లా?
పొత్తిళ్లలోనేఆమెభవిష్యత్తుపై
అంచనాలువేస్తున్నప్పుడు
మీరుపెంచుతున్నదిఒకజీవాన్నా?
లేక……..
అప్పులభారంతోకుంగిపోయే
ఒకఅభద్రతనా?
అమ్మాయిఅడుగుతీసి
అడుగువేస్తుంటే
ఆకాశపుహద్దుల్నిచూపాల్సిందిపోయి…….
కంచెలకాపలామధ్యకలలని
ఎందుకుచిదిమేస్తున్నారు?
మీరుపోగుచేస్తున్న
బంగారునగలు
రేపుఆమెమెడకుఆభరణాలుకావు……
ఆమెగొంతునొక్కేసేసామాజిక
ఆచారాలబరువులు!
పుట్టిననాటినుండే…….
ఆమెపెళ్లిపందిరికోసం
ఎకరాలుఅమ్మకండి
ఆ భూమిసాక్షిగా……..
అక్షరాలవిత్తనాల్ని
ఆమెగుండెల్లోనాటండి!
రంగురంగులపట్టువస్త్రాలను
బీరువాల్లోదాచికాదు
పరిస్థితులఎదురుగాలినితట్టుకునే
పట్టుదలనేపట్టుచీరగాఆమెకుకట్టండి!
వినండి……..
మీరుఇచ్చే ఈ స్థిరాస్తులు
ఆమెనురక్షించవు!
బహుమతులతోనింపే
బంగారుపేటికలుకాదు.
బహుముఖప్రజ్ఞనుఇచ్చే
వివేకాన్నిఅప్పగించండి.
నడకనేర్పినప్పుడే…….
నలుగురూచూస్తారనికాక
నలుగురిలోఒంటరిగా
నడిచేనైతికతనునేర్పండి!
చదువుఅంటేకేవలంఉద్యోగం
కోసంవేసేబాటకాదు.
తప్పునుతప్పుఅనిఎలుగెత్తిచాటే
‘విస్ఫోటనం’!
అన్యాయాన్నిఎదిరించే
ఒకఅజేయమైన ‘ఆయుధం’!
వంటగదిగోడలమధ్య
పొగగామారిపోయేజీవితంకాదు.
అంతరిక్షపుఅంచుల్లో
వెలుగులీనేఒకసంతకం!
ఆడపిల్లఅంటేఅప్పగించాల్సిన
‘సొత్తు’ కాదు.
నిజానికిఆమె………
ఈ జగత్తుకే ‘సత్తువ’!
రేపుఆమెనుఅత్తారింటికి
సాగనంపేటప్పుడు……..
కన్నీళ్లతోకారిపోయేబలహీనతను
కానుకగాఇవ్వకండి.
కష్టాలనుకడిగేసేసంకల్ప
బలాన్నివీడ్కోలుగాఇవ్వండి!
అరిసెలు, అప్పడాల
మూటలకంటే………
అవమానాలుఎదురైతే
అగ్నిపర్వతంలామారే
ఆత్మస్థైర్యాన్నిపంపండి!
నైతికవిలువలనాణ్యాలే
ఆమెకుఅసలైనసంపద
పిడికిలిబిగించేధైర్యమే
ఆమెకుఅసలైనరక్షాకవచం!
మీరుమీకూతురికి
ఇచ్చేగొప్పవీలునామా…….
బ్యాంకునిల్వలుకాదు,
భాగ్యవంతమైనభవనాలు
అంతకన్నాకాదు……..
ఏ గాలివానకూవంగని…….
ఏ తుఫానుకూచెదరని……..
నిటారుగానిలబడే
‘వెన్నెముక’ లాంటిధైర్యం!
లోకంనేర్పేభయాలను
తుడిచేయండి.
ఆమెఆలోచనలకుఆకాశమంత
స్వేచ్ఛనుఇవ్వండి.
ఆమెఆశయాలకుఅండగా
నిలిచేఅభయాన్నిఇవ్వండి!
ప్రశ్నించేగొంతును
బహుమతిగాఇవ్వండి.
ప్రవహించేచైతన్యాన్ని
వారసత్వంగాఇవ్వండి!
అప్పుడేఆమెగమ్యం
ఒకఅద్భుతం
అప్పుడేమీపెంపకం
ఒకఅమరకావ్యం!
ఆమెకళ్లలోభయంలేనిరోజే……..
మీరుఆమెకుఇచ్చిన ‘
నిజమైనఆస్తి’…….
అదేమీరురాసిన
‘చారిత్రకవీలునామా’!
-మీమనురామ్.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
వారసత్వవీలునామా(కవిత )మనురామ్. — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>